పాతికేళ్ల కుర్ర హీరోతో హన్సిక రొమాన్స్.. గర్ల్ ఫ్రెండ్ గా..
మలయాళ చిత్రం 'ప్రేమలు' గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మలయాళ చిత్రసీమలో 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్య పరిచిన కుర్ర హీరో నస్లేన్. నస్లేన్.. 2019లో వచ్చిన 'తన్నీర్ మథన్ దినంగల్' అనే సినిమాతో మలయాళీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అయితే ప్రేమలు చిత్రంతో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీలో సచిన్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.
ప్రేమలు మూవీ తర్వాత నస్లేన్.. ఆలప్పుళ జింఖానా, లోకా ఛాప్టర్ 1 చంద్ర తదితర సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో యువతకు దగ్గరైన నస్లేన్ మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే బ్యాచిలర్ పార్టీ డీలక్స్ లోనూ నస్లేన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటుడు కృష్ణ కుమార్ కుమార్తె, పాపులర్ ఇన్ ఫ్లూయెన్సర్ హన్సిక కృష్ణ నటిస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం.. ఈ మూవీలో నస్లేన్ గర్ల్ ఫ్రెండ్ గా హన్సిక ఉండబోతుంది.
ఇక హన్సిక కు సోషల్ మీడియాలో 10 లక్షలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె మలయాళీ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఆమె వ్లాగ్స్, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతుంటాయి. హన్సిక లూకా చిత్రంతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన సోదరి అయిన ఆహాన్ కృష్ణన్ చైల్డ్ హుడ్ పాత్రలో ఆమె మెరిసింది. ఇక బ్యాచిలర్ పార్టీ డీలక్స్ మూవీ హన్సిక కెరీర్ కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కానుంది.

ఈ మూవీలో నస్లేన్, హన్సిక తోపాటుగా కున్చాకో బోబన్, టోవినో థామస్, సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, షైన్ టోమ్ చాకో, నదియా మోయిదు, జ్యోతిర్మయి, రజిషా విజయం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని అమల్ నీరధ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 2012 లో విడుదలైన బ్యాచిలర్ పార్టీ మూవీ హిట్ అయిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత ఆ మూవీకి కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కుతోంది.












Click it and Unblock the Notifications