విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే!

తన అందం, నటనతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి హన్సిక మోత్వానీకి సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. హన్సిక తన భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. వారు విడిపోతున్నారని వార్తలు వస్తుండగా.. ఇప్పుడు ముంబైలోని బాంద్రా కోర్టు వీరి విడాకులను ఖరారు చేసినట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే?
ప్రముఖ నటి హన్సిక మోత్వానీ, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా డిసెంబర్ 4, 2022న జైపూర్‌లో ఎంతో ఘనంగా వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లైన కొన్నాళ్ల వరకు వీరి దాంపత్యం బాగున్నట్లు కనిపించినా.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా సోహైల్ కతూరియాకు దూరంగా ఉంటున్న హన్సిక మోత్వానీ.. తన తల్లితో కలిసి నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భర్తతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలను కూడా ఆమె తొలగించడంతో విడాకుల పుకార్లకు బలం చేకూరింది.

Hansika Motwani has reportedly divorced her husband Sohael Kathuria 4-Year Marriage Ends

గతంలోనూ వివాదాలిలా..!
హన్సిక మోత్వానీ వివాహం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సోహైల్ కతూరియాకు ఇది రెండో వివాహం కాగా.. అతని మొదటి భార్య హన్సికకు సన్నిహిత స్నేహితురాలే అనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్‌కు హన్సిక అప్పట్లో స్పందిస్తూ.. సోహైల్ గతం నాకు తెలుసు.. కానీ వారిద్దరూ విడిపోవడానికి నేను కారణం కాదని వివరణ ఇచ్చారు.

విడాకులకు కారణం ఏంటంటే?
హన్సిక, సోహైల్ విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోయారని వార్తలు విని హన్సిక అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అయితే హన్సిక వ్యక్తిగత జీవితానికి సంబంధించి బయటకు వస్తున్న వార్తలపై అటు నటి గానీ.. ఇటు సోహైల్ కతూరియా గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+