Hanuman: అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్ మామూలుగా ఉండదట..!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత పెద్ద తోపు సినిమా అయినా.. ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా 20 రోజులు మా అంటే 30 రోజులు మహా అంటే 40 రోజులు.. అంతకు మించి థియేటర్లలో ఆడడం లేదు. కానీ చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సాధించిన హనుమాన్ చిత్రం మాత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇది రికార్డు అని చెప్పుకోవాలి. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాను తట్టుకుని ఈ మూవీ దూసుకెళ్తోంది.
ఈ సినిమా 150 థియేటర్లలో 50 పూర్తి చేసుకుంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇచ్చిన మూవీ హిస్టారికల్ 50 డేస్ పండుగను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. హనుమాన్ సిక్వెల్ అయిన జై హనుమాన్ స్క్రిప్ట్ పూర్తయినట్లు ప్రకటించాడు. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ వర్క కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరలో జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని ప్రకటించాడు.

జై హనుమాన్ లో హనుమంతడే హీరో అని ప్రకటించాడు. హనుమాన్ ఎలా ఉందో.. జై హనుమాన్ అలానే ఉంటుందని అన్నాడు. ప్రతి ఒక్కరకి నచ్చేలా మూవీని తెరకెక్కిస్తానని చెప్పాడు. జై హనుమాన్ మూవీలో తేజ సజ్జ హనుమంతు పాత్రలోనే కనిపిస్తారట.. కానీ ఆంజనేయుడి పాత్రలో ఓ స్టార్ హీరో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జై హనుమాన్ మూవీని 2025 సంక్రాతి సందర్భంగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.
ఇక హనుమాన్ మూవీ రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వేచి చూస్తున్నారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ సంబంధించి జీ5 ప్రకటన చేసింది. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న హనుమాన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హనుమాన్ ఓటీటీ రైట్స్ భారీ ధర దక్కింది. రూ.16 కోట్లకు జీ5 హనుమాన్ ఓటీటీ రైట్స్ సొంత చేసుకుంది. ఇందులో తెలుగు వెర్షన్ కు రూ.11 కోట్లు, హిందీ వెర్షన్ కు రూ.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్










Click it and Unblock the Notifications