Hanuman: రూ.280 కోట్లకు చేరిన హనుమాన్ కలెక్షన్లు.. హీరో రెమ్యునరేషన్ కోటి రూపాయలే..!
మొదట్లో ఆ సినిమాకు థియేటర్లే దొరకలేదు. కానీ మూవీ విడుదల అయిన తర్వాత సీన్ మారింది. పెద్ద సినిమాను వెనక్కి నెట్టుతూ హనుమాన్ మూవీ దూసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలై 24 రోజులు అయింది. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా 23వ రోజు వరకు తెలంగాణ, ఏపీలో కలిపి రూ.141 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇతరు భాషలు, ఓవర్ సిస్ మొత్తం కలిపి హనుమాన్ రూ.277 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.
హనుమాన్ 24 రోజు సండే వచ్చింది. దీంతో ఆ రోజు హనుమాన్ కలెక్షన్లు పెరిగాయి. ఈ మూవీ సండే ఒక్క రోజు రూ.1.6 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.3 కోట్లు రాబట్టింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సండే వరకు రూ.142 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి హనుమాన్ మూవీ కలెక్షన్లు రూ.280 కోట్లను తాకినట్లు తెలుస్తోంది. ఈ మూవీ త్వరలో రూ.300 కోట్ల మార్క్ ను దాటేసే అవకాశం కూడా ఉంది.

Recommended Video

హనుమాన్ 92 ఏళ్ల టాలీవుడ్ ప్రస్థానంలో ఆల్‌టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా రికార్డ్ సృష్టించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి సిక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ లో కూడా తేజ సజ్జా నటించనున్నాడు. ప్రధాన పాత్ర రాముడి క్యారెక్టర్ కు ప్రముఖ హీరో ను తీసుకునే అవకాశం ఉంది. ఈ మూవీకి రూ.280 కోట్లు వచ్చినా.. సినిమా చేసినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట.
ఇక తేజ సజ్జా కూడా కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలిసింది. సినిమా అనుకున్న దాని కంటే బ్లాక్ బ్లాస్టర్ హిట్ కావడంతో నిర్మాత నిరంజన్ రెడ్డి దర్శకుడు, హీరో రెమ్యునరేషన్ పెచ్చినట్లు తెలుస్తోంది. తేజ సజ్జాకు రూ. 5 కోట్లు, దర్శకుడు ప్రశాంత్ వర్మకు రూ.6 కోట్లు ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీ యూనిట్ అయోధ్య రామందిరానికి కూడా భారీగానే విరాళం ఇచ్చింది. టికెట్ పై రూ.5 రాములవారికి సమర్పించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications