Hanuman: ఆ సినిమాలను చీల్చిచెండాడిన హనుమాన్.. బుకింగ్‍లోనూ రికార్డు..!
చిన్న సినిమా.. చిన్న హీరోనే కదా అని తక్కువ థియేటర్లే ఇచ్చారు. కానీ.. పెద్ద సినిమాలను వెనక్కు నెట్టి ముందు దూసుకెళ్తోంది హనుమాన్ మూవీ. సినిమా చూసిన వారు చాలా బాగుందని మెచ్చుకోవడంతో ఈ మూవీకి మరింత బలం చేకూరింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీగా వసూళ్లు చేస్తోంది. హనుమాన్ వసూళ్లు రెండో రోజు 55,65 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం కూడా ఈ మూవీకి భారీగా రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఆదివారం కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు చేసే అవకాశం ఉంది.
యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ మొదట్లో పెద్ద సినిమాల ముందు నిలబడలేకపోయింది. కానీ మంచి కంటెట్ ఉన్న మూవీ కావడంతో పెద్ద సినిమాలను వెనక్కు నెట్టింది. హనుమాన్ మూవీ రూ. 12.53 కోట్ల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేసింది. ఆదివారం అది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శనివారం వచ్చిన వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 8.4 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ. 4.13 కోట్లు వచ్చినట్లు సమాచారం.

తెలిసింది. ఇక ఇండియావైడ్‌గా రూ. 14.05 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో రూ. 9.45 కోట్ల గ్రాస్‌తో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.23.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. హనుమాన్ సినిమా విడుదల రోజులు రూ.8 కోట్లకు పైగా వసూల్ చేసింది. తెలుగు వెర్షన్ నుంచి రూ. 5.89 కోట్లు రాగా, హిందీ వెర్షన్ రూ.2.1 కోట్లు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నవారు హనుమాన్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు.
తాజాగా ఈ చిత్రం బుక్ మై షోలో అరుదైన రికార్డు అందుకుంది. ఈ మూవీకి సంబంధించి కేవలం రెండు రోజుల్లోనే బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హనుమాన్ మూవీ చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందని కితాబు ఇస్తున్నారు. ఈ మూవీలో ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Massive feat achieved by #HANUMAN on @bookmyshow 💥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 14, 2024
𝟏𝟎,𝟎𝟎,𝟎𝟎𝟎 Tickets Sold in just 2 Days as everyone witnessed #HanuManRAMpage to the heights 🔥
- https://t.co/JWAw5sXDsG
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha… pic.twitter.com/IKCszeRrrC












Click it and Unblock the Notifications