అతను నన్ను వేధిస్తున్నాడు..పోలీస్ స్టేషన్‌కు పవన్ కల్యాణ్ హీరోయిన్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ హానీరోజ్‌ లైంగిక వేధింపులకు గురయ్యారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు నిధి ఆగర్వాల్. ఈ విషయాన్ని నిధి ఆగర్వాల్ బయటపెట్టారు.సోషల్ మీడియాలో తనని ఓ వ్యక్తి వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతానని , సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి ఆగర్వాల్ తన ఫిర్యాదులో పేర్కొంది. నిధి ఆగర్వాల్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు.

Harassment of heroine Nidhi Agarwal

ఇక నిధి ఆగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే..తన అందం, నటనతో మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ, తక్కువ సమయంలోనే తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, నటనతో పాటు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. 'సవ్యసాచి' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నిధి, తర్వాత 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిధి ఆగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' నటిస్తోంది. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+