కార్తీక దీపం సీరియల్ హీరోయిన్‌కు లైంగిక వేధింపులు
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో బయటపెట్టడం జరిగింది.గతంతో పోలిస్తే ఇటీవల నటులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా చెబుతున్నారు.
ఇక సెలబ్రిటీలకు సైతం ఈ వేధింపులు తప్పడం లేదు.తాజాగా కార్తీక దీపం సీరియల్ నటికి సైతం లైంగిక వేధింపులు తప్పలేదు. బుల్లితెరపై అమూల్య గౌడకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కార్తీక దీపం సీరియల్ మొదట్లో అమూల్య గౌడకు మంచి ప్రాధాన్యత ఉండేది. ఆ తరువాత కథలో ఆమె పాత్ర తగ్గిపోతూ వచ్చింది. ప్రస్తుతం అమూల్య గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో నటిస్తోంది.

అమూల్య గౌడ తాజాగా లైంగిక వేధింపులకు గురైంది. తనకు సూర్య అనే వ్యక్తి అవకాశాలు ఇస్తానని చెప్పి..లైంగిక వేధింపులకు గురి చేశాడని అమూల్య గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ..సూర్య అనే వ్యక్తి తనను కాస్టింగ్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. నన్ను ఆడిషన్‌కు పిలిచి వెళ్లి వచ్చాక అసభ్యకరమైన మేసేజ్‌లు పంపుతున్నాడు. లైంగికంగా వేధించడం తో నేను అతడిని నిలదీశాను.
దీంతో అతను నన్ను పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకో పో అని బెదిరించాడని తెలిపింది. అతనికి బుద్ధి చెప్పి నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. దీంతో సూర్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న అతను పరారీ అయినట్లు తెలుస్తోంది. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications