బాయ్ ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యాకు ఎదురుపడ్డ భార్య
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల వార్త సంచలనం రేపుతోంది. హార్దిక్ పాండ్యా భార్య నటాషా అతనికి విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందనే విషయం అందరికి తెలిసిందే. 2020లో హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే కమిట్ అయిన ఈ జంట.. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లైంది.పెళ్లి తర్వాత ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు.
హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఏ టీం తరుఫున ఆడిన ఆమె అతనికి మద్దతిచ్చేది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా పాండ్యా అరంగేట్రం చేసినా.. నటాషా మాత్రం కనిపించలేదు. అలాగే, అతను ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు.అలాగే మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు.

దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమనే అంతా భావిస్తున్నారు. దీంతో పాటు నటాషా వరుసగా హార్దిక్‌తో విడాకులు గురించి పరొక్షంగా స్పందిస్తూ వస్తోంది. ఇదే సమయంలో నటాషా ప్రియుడంటూ ఓ వ్యక్తి తెర మీదకు వచ్చాడు. హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన తర్వాతే ఆమె అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అంబానీ ఇంట జరిగిన పెళ్లికి నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో హాజరు కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మరోవైపు హార్దిక్ మాత్రం సింగిల్‌గానే హాజరయ్యాడు. బారాత్‌లో కింద పొర్లుతూ మరి డ్యాన్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అసలు హార్దిక్ లైఫ్‌లో ఏం జరుగుతుందంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నాడని ఫీల్ అవుతున్నారు. ఈ ఘటనతో హార్దిక్ విడాకులు దాదాపు ఖాయం అయినట్లే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications