దయనీయమైన స్థితిలో ‘హరి హర వీరమల్లు’.. ఎపిక్ డిజాస్టర్

భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన పవన్ కళ్యాణ్ నటించిన "హరి హర వీరమల్లు" చిత్రం నిన్నటి ప్రీమియర్ షోల నుంచే అభిమానుల నుంచి డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాలోని కంటెంట్ ఒక మాదిరిగా ఉన్నప్పటికీ, అత్యంత దారుణమైన VFX కారణంగా అభిమానుల నుంచే చీవాట్లు ఎదురయ్యాయి.

VFX నాణ్యతపై తీవ్ర విమర్శలు
చాలా కాలం తర్వాత పవన్ సినిమాను వెండితెరపై చూసుకోవచ్చనే ఆనందంతో థియేటర్‌కు వచ్చిన అభిమానులకు ఈ సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. చిన్న చిన్న చిత్రాలు కూడా క్వాలిటీ VFXతో వస్తున్న ఈ రోజుల్లో, రూ. 250 కోట్ల బడ్జెట్ అంటూ డప్పు కొట్టుకొని వచ్చిన "హరి హర వీరమల్లు" VFX కనీస స్థాయిలో కూడా లేకపోవడం అభిమానులకు మింగుడుపడని విషయం. ఇది సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచింది.

Hari Hara Veeramallu ticket sales plummet on Bookmyshow

టికెట్ సేల్స్‌పై తీవ్ర ప్రభావం
సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ టికెట్ సేల్స్‌పై బలమైన ప్రభావం చూపింది. బుక్‌మైషో యాప్‌లో మొదటి రోజున గంటకు 20 వేల టికెట్లు కూడా అమ్ముడుపోలేదు. ఈరోజు ఉదయం పది గంటల సమయంలో గంటకు 18 వేల టికెట్లు అమ్ముడుపోయినప్పటికీ, ఆ తర్వాత నెమ్మదిగా పడిపోయి, ఇప్పుడు గంటకు 9 వేలకు పైగా టికెట్స్ మాత్రమే అమ్ముడవుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ధనుష్ "కుబేర" చిత్రం మొదటి రోజు కలెక్షన్ల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. ఒక స్టార్ హీరో సినిమాకు మొదటి రోజు ఇంత దారుణమైన పతనం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదని సినీ వర్గాలు అంటున్నాయి. దీన్ని బట్టి నెగటివ్ టాక్ ఏ రేంజ్‌లో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

డిజాస్టర్ సినిమాకు సక్సెస్ మీట్: పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్
ఇంతటి దారుణమైన ఫలితాన్ని అందుకున్న ఈ చిత్రానికి మరికాసేపట్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మీటింగ్‌కు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారట. ఆయన ఒక సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటిది ఈ సినిమా కోసం ఆయన కష్టపడి మరీ ప్రమోట్ చేస్తుండటం విశేషం. పవన్ కళ్యాణ్ ఒక మంచి సినిమాను తన భుజాన వేసుకొని ప్రమోట్ చేసి ఉంటే అభిమానులు సంతోషించి ఉండేవారు. కానీ, ఒక ఫ్లాప్ సినిమాను 'బాగుంది, సూపర్ హిట్ అయ్యింది, అందరూ చూడండి' అంటూ పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి చెప్పడం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+