లక్షలకు పడిపోయిన పవన్ కల్యాణ్ క్రేజ్..ఇక మర్చిపోవడమే బెటర్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వీకెండ్ జోరు తర్వాత వర్కింగ్ డేస్‌లో నిరాశ పరిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ డ్రాప్స్‌ను నమోదు చేసింది. 'హరిహర వీరమల్లు' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, వీకెండ్‌లో కొంతవరకు నెట్టుకొచ్చినా, వర్కింగ్ డేస్‌లో మాత్రం కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చింది.
హరిహర వీరమల్లు' పెయిడ్ ప్రీమియర్ల ద్వారా రూ.12.75 కోట్లు రాబట్టి మంచి శుభారంభాన్నిచ్చింది. ఫస్ట్ డే నాడు రూ.34.75 కోట్లు వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, మూడో రోజున రూ.9.15 కోట్లు, నాలుగో రోజున రూ.10.6 కోట్లు వసూలయ్యాయి.

వీకెండ్ వరకు కొంత పర్వాలేదనిపించినా, వర్కింగ్ డేస్‌లో సినిమా కలెక్షన్లు ఊహించని విధంగా పడిపోయాయి. ఐదో రోజైన సోమవారం కేవలం రూ.2.1 కోట్ల నెట్ మాత్రమే రాబట్టగలిగింది. ఆరో రోజుకు వచ్చేసరికి పరిస్థితి మరింత దిగజారింది. ఆరో రోజున ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.80 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇక 9వ రోజున కేవలం 6 వేల లోపే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 17 లక్షల రేంజ్ లో షేర్ మార్క్‌ని అందుకుంది ఈ సినిమా.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ఈ సినిమా మొత్తం రూ. 68.16 కోట్ల నికర కలెక్షన్లను (రూ. 111.60 కోట్ల స్థూల) సాధించింది. సినిమా మొత్తం వ్యాపారం రూ. 126 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ రూ. 127.50 కోట్లు. అంటే, బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి ఇంకా రూ. 59.34 కోట్లు అవసరం. రెండవ వారంలోకి ప్రవేశించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, "హరి హర వీర మల్లు" సినిమా కోలుకోవడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications