హ్యారీ పోటర్ నటి మ్యాగీ స్మిత్ మృతి...
హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. హ్యారీ పోటర్ నటి మ్యాగీ స్మిత్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మ్యాగీ తీవ్ర అనారోగ్య సమస్యలతో నిన్న (శుక్రవారం) మృతిచెందారు. హ్యారీపోటర్ పేరు చెప్పగానే హాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు మన కళ్లముందు మెదలాడుతాయి. సుమారు ఇరవై ఏళ్ల క్రితమే అదిరిపోయే గ్రాఫిక్స్‌తో తీసిన చిత్రాలే ఈ హ్యారీపోటర్.
ఈ చిత్రాలు ఇప్పటీకీ చాలామందికి ఫేవరెట్‌గా కూడా ఉన్నాయి. ఇక, ఈ సినిమాల్లోని పాత్రధారులకు కోట్లాది మంది అభిమానులున్నారంటే ఆశ్చర్యం లేదు. అయితే, గడిచిన కొన్నేళ్ల నుంచి 'హ్యారీ పోటర్' నటీనటులు ఒక్కొక్కరుగా మృతిచెందుతూ ఉన్నారు. గత సంవత్సరం హ్యారీపోటర్ నటుడు మైఖేల్ గ్యాంబెన్ అలియాస్ ప్రొఫెసర్ డంబెల్ డోర్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా ఆ సినిమాలోని మరో నటి కన్నూమూశారు.

'హ్యారీ పోటర్' సిరీస్‌లో ప్రొఫెసర్ మెక్ గొనగల్ పాత్రలో ప్రేక్షుకులను అలరించిన మ్యాగీ స్మిత్ (89) తీవ్ర అనారోగ్య కారణాలతో శుక్రవారం మృతిచెందారు. ఆమె తన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని కూడా అందుకున్నారు. అది కూడా ఒకసారి కాదు. రెండు సార్లు ఆస్కార్ విజేతగా నిలిచారు. సినిమాల్లోనే కాకుండా టీవీ సిరస్‌తోనూ ఈమె తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. 'డౌన్ టౌన్ అబే' అనే టీవీ సిరీస్‌తోనూ ఈమె ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications