‘హ్యారీ పోటర్’ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్!
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న 'హ్యారీ పోటర్' సిరీస్ సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ రాసిన నవలల ఆధారంగా హెచ్‌బీవో తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక టీవీ సిరీస్ 'హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్' ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ 2 నిమిషాల 37 సెకన్ల నిడివి గల టీజర్ మంత్రాల ప్రపంచంలోకి కొత్తదనాన్ని విజువల్ వండర్‌గా పరిచయం చేస్తోంది.
కొత్త నటీనటులతో ప్రారంభమైన మంత్రాల ప్రపంచం
ఈ కొత్త సిరీస్‌లో ఐకానిక్ పాత్రలైన హ్యారీ పోటర్‌గా డొమినిక్ మెక్‌లాఫ్టిన్, రాన్ వీస్లీగా అలస్టెర్ స్టౌట్, హెర్మియోన్ గ్రేంజర్‌గా అరబెల్లా స్టాంటన్ నటించారు. టీజర్లో వీరి ముగ్గురు హోగ్వార్ట్స్ మ్యాజిక్ స్కూల్లో అడుగుపెట్టడం, గ్రిఫిండర్ హౌస్‌లోకి ఎంపిక కావడం వంటి కీలక సన్నివేశాలను చూపించారు. వీరితో పాటు ఆల్బస్ డంబల్‌డోర్‌గా జాన్ లిత్‌గో, మిగతా కీలక పాత్రల్లో జానెట్ మెక్‌టీర్, పాపా ఎస్పీడు, నిక్ ఫ్రాస్ట్ తదతరులు కనిపించనున్నారు.

టీజర్లోని హైలైట్స్
టీజర్‌లో హోగ్వార్ట్స్ పాఠశాలలోని రోజువారీ తరగతులు, హెర్బాలజీ, పోషన్స్ క్లాసులతో పాటు క్విడిచ్ ఆట దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు స్కూల్ బాత్‌రూమ్‌లో విరుచుకుపడే 'మౌంటెన్ ట్రోల్' విలన్‌తో హ్యారీ బృందం జరిపే పోరాటం, ఉత్కంఠరేపే 'జాయింట్ చెస్' గేమ్, అదృశ్యమయ్యే ముసుగు, మిర్రర్ ఆఫ్ ఎరిసెడ్ వంటి అద్భుత ఘట్టాలను ఇందులో క్లియర్ రీ-క్రియేషన్‌గా చూపించారు.
ఈ క్రిస్మస్‌కు విడుదల
ఫ్రాన్సెస్కా గార్డినర్ రచన, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు మార్క్ మైలోడ్ అనేక ఎపిసోడ్లకు దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్బీవో సంస్థ బ్రోంటే ఫిలిం అండ్ టీవీ, వార్నర్ బ్రదర్స్ టెలివిజన్లతో కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా అమెరికాలో హెచ్బీవో నెట్వర్క్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్.. భారతీయ ప్రేక్షకుల కోసం 'జియో-హాట్‌స్టార్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది.
THE NEW HBO’s HARRY POTTER TRAILER IS HERE
— Wizarding World Direct (@WW_Direct) September 2, 2026
Releasing this Christmas on HBO pic.twitter.com/OvCm0Lz4bL













Click it and Unblock the Notifications