Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా భార్య ఎంపీ అయితే చూడాలని ఉంది, స్టార్ హీరో మనసులో మాట, ఆ ఫ్యామిలీలో పెద్ద కోడలు !

శ్యాండిల్ వుడ్ ప్రముఖ నటుడు, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున టిక్కెట్లు ఇస్తామని బహిరంగంగా ప్రకటించినా హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న మాత్రం సున్నితంగా ఎంపీ సీటును తిరస్కరించారు. అయితే తన భార్య గీతా పక్కా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని హీరో శివరాజ్ కుమార్ ఇప్పటికే బహిరంగంగా అందరికి చెప్పారు.

హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్ బంగారప్ప కుమార్తె. తన రక్తంలో రాజకీయం ఉందని, అయితే దాను దోడ్డన్న (డాక్టర్ రాజ్ కుమార్ ఫ్యామిలి)లో అడుగుపెట్టడం వలన రాజకీయాలకు దూరం అయ్యానని ఇంతకు ముందు గీతా శివరాజ్ కుమార్ అన్నారు. అయితే ఇప్పుడు డాక్టర్ రాజ్ కుమార్ ఫ్యామిలీలో ఉన్న ఏకైక రాజకీయ నాయకురాలు గీతా శివరాజ్ కుమార్.

Hat trick hero Shivraj Kumar who expressed his opinion that he wants to see my wife as an MP

గతంలో జేడీఎస్ పార్టీలో ఉన్న గీతా శివరాజ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. పైగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గీతా శివరాజ్ కుమార్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని హీరో శివరాజ్ కుమార్ కూడా పరోక్షంగా చెప్పారు. తన భార్య గీతా గురించి తనకు పూర్తిగా తెలుసు అని, ఆమె ఏం కోరుకుంటున్నారో కూడా తెలుసు అని, తాను రాజకీయాల్లో లేకపోయినా తన భార్య గీతాను రాజకీయంగా ప్రజలకు సేవ చెయ్యడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని హీరో శివరాజ్ కుమార్ అన్నారు.

గతంలో జేడీఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన గీతా శివరాజ్ కుమార్ తరపున హీరో శివరాజ్ కుమార్ కూడా ప్రచారం చేశారు. కానీ గీతా శివరాజ్ కుమార్ ఓటమి పాలైంది. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన గీతా శివరాజ్ కుమార్ మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. అదే సమయంలో శివమొగ్గలో మాట్లాడిన శివరాజ్ కుమార్ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని అన్నారు. అయితే తన భార్య గీతా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిందని, రాజకీయం అనేది ఆమె రక్తంలోనే ఉందని శివరాజ్ కుమార్ చెప్పారు.

Hat trick hero Shivraj Kumar who expressed his opinion that he wants to see my wife as an MP

తన భార్య రాజకీయంగా ఎదగాలని, తన భార్య ఎంపీ కావాలనే ఆకాంక్షను తాను వ్యక్తం చేస్తున్నానని హీరో శివరాజ్ కుమార్ చెప్పారు. శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్‌ పోటీ చేస్తారా? అనే విషయం మాత్రం బయటకు చెప్పడం లేదు. అయితే గీతా శివరాజ్‌కుమార్‌కు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్టు దాదాపు ఖాయమైంది. శివరాజ్‌కుమార్ రాజకీయాల్లోకి రాకపోవడంతో బంగారప్పకు పట్టున్న శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్‌ బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి.

శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్‌ పోటీ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో శివమొగ్గ నుంచి పోటీ చేయడంపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని హీరో శివన్న అన్నారు. అలా శివమొగ్గ నుంచి డాక్టర్ రాజ్ కుమార్ పెద్ద కోడలు గీతా శివరాజ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారని స్థానికులు చెబుతారు. అలాగే గీతా శివరాజ్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, తన భర్త శివరాజ్ కుమార్, తన సోదరుడు మధు బంగారప్ప చెబితేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని గీతా శివరాజ్ కుమార్ అంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తాను చాలాసార్లు శివమొగ్గ జిల్లాలో పర్యటించానని గీతా శివరాజ్ కుమార్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+