ప్రేమిస్తున్నాడని అనుకున్నా.. నమ్మించి మోసం చేశాడు: నయనతార
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఇటీవలే షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో నటించినందుకు పారితోషికంగా రూ.12 కోట్లు అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోని చిత్ర సీమల్లో అత్యధిక పారితోషికాన్ని అందుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు గతంలో తనకున్న ప్రేమ సంబంధాలు కూడా వార్తల్లో నిలిచేవి. నయనతారకు కావల్సినంత ప్రచారాన్ని తీసుకువచ్చేవి. అయితే ఎవరిని ప్రేమించినా అవేవీ పెళ్లిపీటల వరకు వెళ్లలేదు.
నయనతార గురించి నాగార్జున ఏమన్నారంటే
చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు కవల పిల్లలున్నారు. తాజాగా నయనతార జీవితానికి సంబంధించిన కథతో డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీలో తన ప్రేమ, పెళ్లి, కుటుంబం.. ఇలా అన్ని విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన రిలేషన్ షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నయనతారతో కలిసి పనిచేసిన హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపించి ఆమె గురించి నాలుగు మంచి మాటలు పంచుకున్నారు. అలాగే తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతు సెట్ లో నయనతార ఫోన్ మోగితే అందరికీ భయం వేసేదని, ఫోన్ లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని, ఫోన్ ఎత్తి మాట్లాడగానే నయనతార మూడ్ మొత్తం మారిపోయేదని నాగార్జున చెప్పారు. తన రిలేషన్ షిప్ లోనే సమస్య ఉందని అనిపించేదన్నారు.

తప్పంతా అమ్మాయిలదే అంటారు
దీనికి నయనతార స్పందించింది. ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుందని, తాను అతన్ని మనస్ఫూర్తిగా నమ్మానని, అతను కూడా తనను ప్రేమిస్తున్నాడని అనుకున్నానని, కానీ అలా తనను నమ్మించాడని చెప్పింది. తన గత రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఇష్టం వచ్చినరీతిలో మాట్లాడుకున్నారని, తాను ఒక అమ్మాయిని కాబట్టి అలా మాట్లాడుకోగలిగారని, అబ్బాయి అయితే మాట్లాడుకునేవారు కాదన్నారు. ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేశావు అని ఎవరూ మగాళ్లను అడగరని, అమ్మాయిలను మాత్రం అడుగుతారని, తప్పంతా అమ్మాయిలదే అన్నట్లుగా వార్తలు రాస్తారంటూ నయనతార భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం అతను ఎవరు అనే విషయాన్ని మాత్రం నయన చెప్పలేదు. నెటిజన్లు మాత్రం రకరకాల హీరోల పేర్లు చెబుతూ చర్చ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications