"లేడీ పవర్ స్టార్"కి బిగ్ షాక్.. కొత్త సినిమాపై గట్టిగా ట్రోల్స్ !!
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి "సాయి పల్లవి". తన సహజమైన నటన, డ్యాన్స్ స్కిల్స్, ప్రత్యేకమైన ఇమేజ్‌తో అభిమానులను సొంతం చేసుకున్నారు. అందుకే టాలీవుడ్ ప్రేక్షకులు ప్రేమతో ఆమెను "లేడీ పవర్ స్టార్" అని పిలుస్తారు. సౌత్‌లో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆమె.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సైతం పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. గ్లామర్ షో కి దూరం ఉంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ.
సాయి పల్లవి సినీ కెరీర్..
మలయాళంలో "ప్రేమమ్" సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు సాయి పల్లవి. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన "ఫిదా" కూడా భారీ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగారు. అనంతరం వరుసగా ఎంసీఏ, పడి పడి లేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించి నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన "అమరన్" సినిమా ఘనవిజయం సాధించింది. అలాగే తెలుగులో నాగచైతన్యతో కలిసి నటించిన "తండేల్" కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం సాయి పల్లవి నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ "రామాయణ" లో ఆమె సీతదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు రూ.1600 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇది రెండు భాగాలుగా రూపొందుతుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్, దక్షిణాది స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అలానే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన "ఏక్ దిన్" అనే మూవీలో కూడా సాయి పల్లవి నటిస్తుంది. అయితే ఈ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి నెటిజన్లు దీనిపై గట్టిగా విమర్శలు చేస్తున్నారు. 2016లో విడుదలైన థాయ్ మూవీ "వన్ డే" పోస్టర్ కాపీ కొట్టారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆ రెండు పోస్టర్లకు దగ్గరి పోలికలు ఉండగా.. కేవలం పోస్టర్ మాత్రమే కాకుండా, సినిమా పేరు కూడా దాదాపు ఒకే అర్థం వచ్చేలా ఉంది. దీంతో ఇది ఆ చిత్రానికి అధికారిక రీమేక్ ఆ? అని కామెంట్స్ చేస్తున్నారు. మరీ వీటిపై చిత్ర బృందం రియాక్ట్ కాకపోవడం గమనార్హం.
-
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు











Click it and Unblock the Notifications