వైరల్ అవుతున్న ఈ బ్యూటీ ఏ మూవీలో చేసిందో గుర్తుపట్టారా..?
పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా..? సోషల్ మీడియాలో తన ఫోటోస్, వీడియోలతో ఫుల్ వైరల్ అవుతున్న ఈ భామను చూసిన వెంటనే గుర్తు పట్టడం కష్టమే కానీ.. కొంచెం ఆమె ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం అరెరే ఈ చిన్న పాప అనేస్తారు. అప్పట్లో ముద్దు ముద్దు మాటలతో, సహజ నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న చిన్న అమ్మాయి.. ఇప్పుడు పెద్దది అయిపోయింది అని తెలుస్తోంది.
hello movie చైల్డ్ ఆర్టిస్ట్..
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూవీ 'హలో'. అఖిల్ కెరీర్‌లో రెండో సినిమాగా వచ్చిన ఈ చిత్రం 2017లో విడుదలైంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మలయాళీ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించింది. కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా, క్లాస్ ఆడియన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుంది. మ్యూజిక్, లవ్ స్టోరీ.. నటీనటుల పర్ఫామెన్స్ మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.

మరీ ముఖ్యంగా ఈ ( hello movie ) సినిమాలో చేసిన చైల్డ్ ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాలి. హీరోయిన్ చిన్ననాటి పాత్రలో మెరిసిన "జున్ను" అయితే అందరికీ తెగ నచ్చేస్తుంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అమాయకమైన డైలాగ్స్‌తో ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది. అప్పట్లో సోషల్ మీడియాలో కూడా "హలో జున్ను" అంటూ చాలా ట్రెండ్ అయ్యింది.
అయితే ఆ సినిమా తర్వాత ఈ చిన్నారి పెద్దగా తెరపై కనిపించలేదు. దీంతో చాలామంది ఆమె ఎక్కడుందో, ఇప్పుడు ఏమి చేస్తుందో అని నెట్టింట వెతకడం ప్రారంభించారు. అలా వెతకగా మొత్తానికి ఇప్పుడు యంగ్ బ్యూటీ రూపంలో దర్శనమిచ్చింది.

ఆ అమ్మాయి ఎవరంటే..?
జున్ను పాత్రలో నటించిన ఈ చిన్నారి పేరు మైరా దండేకర్ అని తెలుస్తోంది. అప్పట్లో చిన్నపిల్లగా క్యూట్‌గా కనిపించిన మైరా, ఇప్పుడు పూర్తిగా మారిపోయి స్టైలిష్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం మైరా సినిమాలకు దూరంగానే ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదిస్తోంది. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో ఆ పోస్టులకు నెటిజన్లు "జున్ను" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు మళ్లీ ఈ పోస్టులతో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు వార్తల్లోకి వచ్చింది. మరీ ఈ అమ్మడు మళ్లీ తెరపై కనిపిస్తుందో లేదో చూడాలి.
-
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
'భర్త చనిపోయిన వెంటనే ప్రియుడితో వెళ్లిపోయింది'.. ఆ హీరోయిన్ పై ట్రోల్స్..!! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications