'దేశముదురు' సినిమాను వదులుకున్న స్టార్ హీరో... బ్యాడ్ లక్!

ఒక కథను దర్శకుడు రాసుకునేముందు లేదంటే రచయిత కథను సిద్ధం చేసుకునే క్రమంలో వారి దృష్టిలో ఓ హీరో ఉంటాడు. అతని హావభావాలకు అనుగుణంగా కథను, స్క్రీన్ ప్లేను తీర్చిదిద్దుతారు. బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా కథ లేకపోతే ప్రేక్షకులకు నచ్చదు. సినీ పరిశ్రమలో ఓ హీరో కోసం సినిమా అనుకొని మరో హీరోతో తీయడం సహజంగా జరుగుతుండేదే. పవన్ కల్యాణ్ కోసం సిద్ధం చేసుకున్న కథలతో అతను నచ్చలేదంటే ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాలను పూరీ తెరకెక్కించాడు. అలాగే ఎన్టీఆర్ కోసం బోయపాటి శ్రీను భద్ర సినిమా అనుకుంటే చివరకు అది రవితేజతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

త్రివిక్రమ్ తో కలిసివెళ్లి కథ వినిపించి
బాలయ్యతో రాజమౌళి సింహాద్రి, మగధీర చేయాలనుకున్నాడు. చివరకు తారక్, రామ్ చరణ్ చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. ఇలా ఎన్నో సినిమాలు, ఎంతోమంది హీరోలు వదులుకుంటే వేరే హీరోలు చేశారు. అలాగే అప్పట్లో సంచలనం సృష్టించిన దేశముదురు సినిమాకు పూరీజగన్నాథ్ ముందుగా అనుకున్న హీరో అల్లు అర్జున్ కాదు. సుమంత్ ను దృష్టిలో పెట్టుకొని కథను తయారుచేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్ కలిసివెళ్లి సుమంత్ కు కథ వినిపించారు. అయితే కథలో సన్యాసిని హీరో ప్రేమించడం సరికాదని, ఆ పాయింట్ బాగోలేదంటూ సుమంత్ తిరస్కరించాడు.

hero akkineni sumanth missed the desamuduru super hit movie

తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీ
దీంతో పూరీ ఈ సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించారు. తెలుగు సినీ పరిశ్రమకు హీరోలు సిక్స్ ప్యాక్ బాడీని తొలిసారిగా పరిచయం చేశాడు. పెద్ద సంచలన విజయం సాధించింది. చక్రి అందించిన సంగీతం ఈ సినిమాకు ఎంతో తోడ్పడింది. అలాగే హీరో డైలాగులు చెప్పే తీరు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటువంటి సినిమాను సుమంత్ వదులుకోవడం బ్యాడ్ లక్ అంటున్నారు నెటిజన్లు. ఓ ఇంటర్వ్యూలో సుమంత్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. సుమంత్ ఇదొక్క సినిమానేకాదు.. ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలను, బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు. నువ్వేకావాలి సినిమా నుంచి దేశముదురు వరకు అనేక సూపర్ హిట్ సినిమాలను సుమంత్ వదులుకోవడం దురదృష్టమని చెప్పొచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+