టీడీపీ ఎమ్మెల్యేతో అల్లు అర్జున్, స్నేహారెడ్డి డ్యాన్స్
ప్రజలందరికీ తమ పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కల్పించి మనసుకు ప్రశాంతతను కల్పించడంలో సినిమాలు ముందుంటాయి. ఈ సినిమాల్లో ముఖ్యంగా హీరోలుగా రాణిస్తున్నవారందరినీ ప్రజలు అభిమానిస్తారు. దైవంగా కొలుస్తారు. అందుకు వారు మతం చూడరు.. కులం చూడరు. అలాగే హీరోలు కూడా మసులుకుంటారు. ప్రధానంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉండాలంటే కొంతమందికే పరిమితమవుతున్న రాజకీయ పార్టీలకు దూరంగా ఉండటమే మంచిదనే నిర్ణయంతో హీరోలుంటారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఆ విషయాన్ని మరిచిపోయారు. తాను ఏ రాజకీయపార్టీతో సఖ్యతగా ఉంటున్నప్పటికీ ఆ విషయం బయటకు తెలియకుండా చూడటంలో విఫలమయ్యారు.
అల్లు అర్జున్‌పై ట్రోలింగ్
ఎన్నికలకు ముందు తన స్నేహితుడంటూ నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికి మెగా అభిమానులకు, పవన్ కల్యాణ్ కు దూరమయ్యారు. ఎన్నికల్లో కిషోర్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన జేసీ అస్మిత్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తోపాటు ఆయన సతీమణి స్నేహారెడ్డి.. ఇద్దరూ కలిసి అస్మిత్ తో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

రాజకీయాలతో బన్నీకి సంబంధం లేదు
రాజకీయాల్లో ఏ పార్టీతోను బన్నీకి సంబంధం లేదని, తన అనుకున్నవారి కోసమే మద్దతు పలుకుతాడంటూ బన్నీ అభిమానులు విమర్శకులకు సమాధానం చెబుతున్నారు. అస్మిత్ రెడ్డితో అల్లు అర్జున్ దంపతులకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయంట. గతంలో కూడా వీళ్లంతా సరదాగా పర్యటనలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరలయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికినందుకు బన్నీ ట్రోలింగ్ కు గురయ్యాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి డ్యాన్స్ వేయడంతో మరోసారి అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఏ పార్టీ అని, మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లేనా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ చేస్తున్నారు.
Thanaki ishtamaina vallani support chesthadu, political party lanu kadu#AlluArjun celebrating with Tadipatri TDP MLA Ashmit Reddy pic.twitter.com/TQCkCIORTY
— Race Gurram (@racexgurram) July 28, 2024












Click it and Unblock the Notifications