Hero: దర్శన్ అభిమానికి జజ్జనక, సినీ నిర్మాతకు బెదిరింపులు, క్లైమాక్స్ లో ఇలా!
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయిన కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి చెడుగా మాట్లాడినందుకు ప్రముఖ కన్నడ నిర్మాత ఉమాపతిని బహిరంగంగా బెదిరించిన మరో దర్శన్ అభిమానిని బెంగళూరులోని బసవేశ్వరనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ముందు రెచ్చిపోయి కన్నడ సినీ నిర్మాత ఉమాపతికి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన హీరో దర్శన్ అభిమాని చేతన్ అరెస్టు అయ్యాడు.
బెంగళూరులో ఆటో డ్రైవర్ సంఘం లీడర్, హీరో దర్శన్ అభిమాని అయిన చేతన్ దర్శన్ గురించి మాట్లాడినందుకు నిర్మాత ఉమాపతిని బహిరంగంగా దూషించి బహిరంగంగా ఆయన్ను బెదిరించాడు. దర్శన్ కూడా అభిమానులను రెచ్చగొడుతూ చేతన్ నిర్మాత ఉమాపతిని దూషించాలని వాళ్లను ప్రోత్సహించాడు. హీరో దర్శన్ అభిమాని చేతన్ బెదిరింపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై కన్నడ నిర్మాత ఉమాపతిగౌడ్ బెంగళూరు పశ్చిమ డివిజన్ డీసీపీ గిరీష్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బసవేశ్వర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టు నుంచి అనుమతి పొందిన బెంగళూరులోని బసవేశ్వర నగర పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 504, 506 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టు నుంచి అనుమతి తీసుకుని నిందితుడు హీరో దర్శన్ అభిమాని చేతన్ ను అరెస్ట్ చేశారు.
బెంగళూరు పోలీసులు నిందితుడు చేతన్ ను స్టేషన్‌కు పిలుచుకుని వెళ్లి ఇకపై ఇలా మాట్లాడవద్దని హెచ్చరించారు. నటుడు దర్శన్ అభిమాని చేతన్ దగ్గర ఇంకోసారి ఇలా చెయ్యను అని అతని దగ్గర పోలీసులు లెటర్ రాపించుకున్నారు. తొలుత ఉమాపతి గౌడను వీడియోలో హెచ్చరించి గర్జించిన చేతన్‌ను పోలీస్‌స్టేషన్ లో బెండ్ తియ్యడంతో ఇంకోసారి ఇలా చెయ్యను అని హీరో దర్శన్ అభిమాని వేడుకున్నాడు.
ఇప్పటికే తప్పు చేశాను, ఇక ముందు ఇలా చెయ్యను అంటూ చేతన్ మాట్లాడుతున్న సమయంలో తీసిన వీడియో కనడ టీవీ ఛానల్స్ లో ప్రసారం అయ్యింది. ఇంకోసారి ఇలాంటివి చేయను, ఎవరిని బెదిరించను, దయచేసి నన్ను వదిలేయండి అంటూ నిందితుడు చేతన్ పోలీసులను వేడుకున్నాడు. పోలీస్ స్టేషన్ లో హీరో దర్శన్ అభిమాని షర్టు తీసి పోలీసులను వేడుకుంటున్న సమయంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.












Click it and Unblock the Notifications