japan movie review: కార్తీ 'జపాన్' రివ్యూ
నటీనటులు కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్ , కె. ఎస్. రవికుమార్ , విజయ్ మిల్టన్ , జితన్ రమేష్ , వాగై చంద్రశేఖర్
దర్శకత్వం: రాజు మురుగన్
నిర్మాత: ఎస్.ఆర్.ప్రభు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
Recommended Video

కార్తీ డిఫరెంట్ స్టైల్ & బాడీ లాంగ్వేజ్ తో చేసిన చిత్రం జపాన్. తమిళంతోపాటు తెలుగులోను విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం!!

హైదరాబాద్ లోని రాయల్ జ్యూయలెర్స్ లో 200 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. ఈ దొంగతనానికి పాల్పడింది జపాన్ అని తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడానికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దింపుతారు. తనకు హెచ్ ఐవీ పాజిటివ్ అని తెలుసుకున్న జపాన్ తన ప్రియురాలు సంజు (అను ఇమ్మాన్యుయేల్)ను కలవడానికి కేరళ వెళతాడు. ఈ క్రమంలో శ్రీధర్ (సునీల్) అతణ్ని అరెస్ట్ చేయడానికి జరుగుతున్న వ్యవహారం గురించి వివరిస్తాడు. అసలు ఆ దొంగతనం తాను చేయలేదంటూ షాకింగ్ న్యూస్ చెబుతారు. మరి ఆ దొంగతనం చేసింది ఎవరు? జపాన్ ను ఎందుకు ఇరికించారు? వీటి నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే జపాన్ చూడాలి.
ఈ సినిమాలో కొత్త కార్తీ కనపడతాడు. హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నింటిల్లో కొత్తదనం చూపించడానికి ప్రయత్నించాడు. యాస చాలా బాగుంది. వింతగా ఉంది. నటుడిగా స్థాయికి తగ్గ పాత్ర కాకపోయినప్పటికీ క్యారెక్టర్ లో చక్కగా ఇమిడిపోయాడు. కామెడీ టైమింగ్ తోపాటు యాక్షన్ సీక్వెన్స్ లో తన సత్తా చూపించాడు. తెలుగులో హాస్య పాత్రలు పోషిస్తున్న సునీల్ కు తమిళంలో మంచి పాత్రలు వస్తున్నాయి. అక్కడ బిజీ అవుతున్నాడు. అతడి పాత్రలో కామెడీ, సీరియస్ రెండూ కలిపివున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అతను ఎదుగుతున్న తీరు బాగుంది. అను ఇమ్మాన్యుయెల్ పాత్రకు ప్రాముఖ్యత లేదు. అందాలను ప్రదర్శించి ఆకట్టుకుంది. ఇతర పాత్రధారులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు రాజా మురుగన్ రాసుకున్న కథ ఫిలాసాఫికల్ గా ఉంది. కథను నడిపించిన విధానం మాత్రం ఆకట్టుకోలేదు. సినిమా కాన్సెప్ట్ లో తెరకెక్కించిన కామెడీ సీన్స్ పేలలేదు. లాజికల్ గా ఇచ్చిన లైఫ్ లెసన్స్ ను మాత్రం మెచ్చుకోవాలి. దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయినా, కథకుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నాడు రాజా మురుగన్. సినిమా క్లైమాక్స్ ఆకట్టుకుంది. సినిమాను ముగించిన విధానం అతడికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. జి.వి.ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ వర్క్ & ఆర్ట్ వర్క్ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇమేజ్ కు భిన్నంగా కార్తీ ప్రయత్నించిన సినిమా "జపాన్". సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను విభిన్నంగా కావాలనుకునేవారు ఈ సినిమాను చూడొచ్చు.












Click it and Unblock the Notifications