నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
సీనియర్ హీరోల్లో ప్రస్తుతం ఏ హీరో లేనంత ఫామ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఉన్నారని చెప్పొచ్చు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. మూడు సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఒకప్పుడు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డ బాలకృష్ణ ఇప్పుడు సూపర్ హిట్లతో ముందుకు దూసుకుపోతున్నారు. అందుకు కారణం.. కథల ఎంపికలో మార్పు చేసుకోవడమే. అంతేకాదు.. తనను ఎవరైతే డీల్ చేయగలరని భావిస్తారో ఆ దర్శకుడినే ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మార్పు చేసుకొని విజయవంతంగా దూసుకుపోతున్న బాలయ్య విజయం వెనక ఆయన రెండో కుమార్తె నందమూరి తేజస్విని కూడా ఉన్నారు.
సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులు కుటుంబాల పరంగా మంచి మద్దతు ఉన్నప్పటికీ సరైన కథలను ఎంపిక చేసుకోలేక కెరీర్ పరంగా చేస్తున్న తప్పుల వల్ల సినీ పరిశ్రమకు దూరమవుతున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా నటిస్తూ, సినిమా తర్వాత సినిమా చేస్తూ యువ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన సినిమాకు తీసుకునే పారితోషికం గతంలో రూ.10 నుంచి రూ.15 కోట్లుగా ఉండేది. డబ్బుల విషయంలో నిర్మాతలను ఆయన ఇబ్బంది పెట్టేవారుకాదు.

ఒకరకంగా చెప్పాలంటే పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత డబ్బుల విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరో బాలకృష్ణ. సినిమాలు వరుసగా హిట్టవుతున్నా పారితోషికం పెంచకుండా అలాగే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ ప్రభంజనం సృష్టించడంతో ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు నిర్మాతలు రూ.30 కోట్లను బాలయ్య అడగకుండానే ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా బాలకృష్ణ రెమ్యునరేషన్ రూ.30 కోట్లకు చేరింది. దీంతో ఆయన రాబోయే సినిమాలు కూడా ఇదే రేంజ్ లో విజయాలు సాధిస్తాయని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications