నారా రోహిత్‌కు పెళ్లి కుదిర్చిన నారా భువనేశ్వరి... వధువు ఎవరంటే?

నారా రోహిత్ తెలుగు సినీ పరిశ్రమలో విలక్షనమైన సినిమాలు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. బాణం సినిమాతో పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకుడు. ఆ తర్వాత నుంచి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తినాయుడి రెండో కుమారుడు రోహిత్. రోహిత్ కు శిరీష్ అనే అన్న ఉన్నాడు. అతను కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. పెళ్లి వయసు వచ్చినప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వీరు వివాహానికి దూరంగా ఉన్నారు.

సంబంధం కుదిర్చిన భువనేశ్వరి
ఇటువంటి తరుణంలో నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి జోక్యం చేసుకొని రోహిత్ కు సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈనెల 13వ తేదీన హైదరాబాద్ లో నిశ్చితార్థం జరగబోతోంది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ.. తదితర కుటుంబ సభ్యులంతా హాజరు కాబోతున్నారు. వధువు ఎవరనే విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ ప్రతినిధి2 సినిమాలో రోహిత్ పక్కన హీరోయిన్ గా నటించిన సిరి లేళ్ల అని తెలుస్తోంది. నారావారి కుటుంబం నుంచి కానీ, నందమూరివారి కుటుంబం నుంచి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే సెలబ్రిటీలంతా రోహిత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

hero nara rohit marriage fix this month 13th engagement in hyderabad

లాస్ ఏంజిల్స్ లో కోర్సు
రోహిత్ తన విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే పూర్తిచేసుకున్నారు. తర్వాత చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత పరిశ్రమలోకి అడుగు పెట్టారు. న్యాయార్క్ లోని ఫిలిం అకాడమీ నుంచి నటనలో కోర్సు చేయడంతోపాటు లాస్ ఏంజిల్స్ లో ఫిలి మేకింగ్స్ కోర్సు కూడా పూర్తిచేశారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న నారా రోహిత్ వివాహం కుదరడంతో అతని అభిమానులంతా సంతోషంగా ఉన్నారు. ప్రతినిధి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రెండు సంవత్సరాలు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తిరిగి ప్రతినిధి2తో పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయాన్ని అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+