నువ్వు ఏ సినిమా తీస్తే ఆ సినిమా ఫ్లాపే బాసూ..!
సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే హిట్ పడాల్సిందే. ఇక్కడ హిట్ కొట్టిన వాళ్లకే గౌరవంతో పాటు, ప్రాధాన్యత కూడా ఉంటుంది. హీరో , హీరోయిన్ ,దర్శకుడు అయినా అది ఎవరైనా హిట్ ఉంటేనే పక్కన మనుషులు ఉంటారు. అయితే ఓ హీరో మాత్రం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ హీరో హిట్ కొట్టిన సినిమా ఏదో చెప్పడం కూడా కాస్తా కష్టంగానే మారింది. ఆ హీరో మరెవరో కాదు..నితిన్.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు నితిన్. అయితే నితిన్‌కు రావాల్సిన స్టార్‌డం ఇంకా రాలేదని అభిప్రాయం అందరిలోనూ నెలకొంది. ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది నితిన్ కెరీర్. జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తరువాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది.

నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది. 'భీష్మ' తరువాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్ చివరి నాలుగు సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ,మాచర్ల నియోజకవర్గం, రాబిన్ హుడ్,తమ్ముడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఫెయిల్ అయ్యాయి. తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కడుములని నమ్ముకున్నవర్క్ అవుట్ కాలేదు.
'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి.రాబిన్ హుడ్ పరిస్థితి కూడా అంతే. నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కడుములనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. నితిన్ తాజాగా నటించిన తమ్ముడు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నితిన్ కెరీర్‌పై చాలా సందేహాలు ఏర్పడుతున్నాయి. స్టోరీ సెలక్షన్స్ విషయంలో జాగ్రత్తపడకపోతే నితిన్ కెరీర్ ముగిసిపోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మరి రాబోవు సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications