సంపాదించిన డబ్బును ప్రభాస్ ఏం చేస్తున్నాడు?
మనసున్న మారాజు ప్రభాస్ చేసే మంచి పనుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. మంచి హృదయానికే రాజు అయినటువంటి ఉప్పలపాటి ప్రభాస్ రాజు ప్రస్తుతం భారతదేశంలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నాడు. బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా స్టార్ హీరో అయ్యాడు. అప్పటి నుంచి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందేకానీ తగ్గడంలేదు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ దేశంలోనే అగ్ర కథనాయకుడిగా చెలామణి అవుతున్నాడు. అంతటి ఇమేజ్ ను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.
స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి
సినిమాకు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. ఒక్కోసారి సినిమాల్లో లాభాలు తీసుకుంటున్నాడు. ఐదారు సంవత్సరాల్లో ప్రభాస్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. సంపాదించిన డబ్బును డార్లింగ్ ఏం చేస్తున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే తాను సంపాదించిన డబ్బును స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ ఇల్లు ఉంది. అది కాకుండా నగర శివారులో ఓ ఫామ్ హస్ ఉంది. మరో ఫామ్ హస్ ను నిర్మిస్తున్నాడు.

కుటుంబ సభ్యుల కోసం సంపాదన ఖర్చు
ఇటీవలే ఇటలీలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడంతోపాటు ముంబయిలో ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. అంతేకాకుండా తన సంపాదనను కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం భారీగా ఖర్చు చేస్తుంటాడు. ఇవి కాకుండా బయటకు తెలియనివ్వకుండా చాలా దాతృత్వ కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఈ విషయాలను మాత్రం ఏనాడూ బయటకు రానివ్వలేదు. అలా బయటకు రాకుండా మంచి పనులు చేయడం ప్రభాస్ కే సాధ్యమని ఎంతోమంది కొనియాడుతుంటారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో యూనిట్ సిబ్బందికి తన ఇంటినుంచే భోజనాలు తెప్పిస్తుంటాడు ప్రభాస్. ఈ విషయాన్ని అతనితో పనిచేసిన హీరోయిన్లతోపాటు ఇతర నటీనటులంతా చాలా సంవత్సరాలు గొప్పగా చెబుతుంటారు.












Click it and Unblock the Notifications