షారుక్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టిన ప్రభాస్

పాన్ ఇండియా రెబల్ స్టార్, అందరికీ డార్లింగ్ అయిన ప్రభాస్ తన తాజా చిత్రం 'కల్కి' ద్వారా సంచలన రికార్డులను నెలకొల్పుతున్నాడు. ఈ క్రమంలో అగ్ర కథానాయకుల రికార్డులన్నింటికీ పాతర వేస్తున్నాడు. బాహుబలి2 తర్వాత ఆ స్థాయి విజయం వేచిచూస్తున్న డార్లింగ్ కల్కి ద్వారా తన ఆకలి తీర్చుకుంటున్నాడు. ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా రూ.1200 కోట్లు రాబట్టే దిశగా పయనిస్తోంది. ఈ సినిమా విజయం సాధించడంద్వారా వచ్చిన ఉత్సాహంతో ఉన్న ప్రభాస్ తన తర్వాత చిత్రాలను కూడా శరవేగంగా పూర్తిచేయాలనే ఆలోచనతో ఉన్నారు.

12.15 మిలియన్ టికెట్ల విక్రయం
కల్కి రికార్డుల పరంపరలో మరో రికార్డు బద్దలైంది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు విక్రయమైన సినిమాగా ఇంతకుముందు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చిత్రం జవాన్ పేరుమీద రికార్డు ఉండేది. ఆ సినిమాకు సంబంధించి 12.01 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. తాజాగా ప్రభాస్ కల్కి చిత్రం టికెట్లు 12.15 మిలియన్లకు పైగా విక్రయమయ్యాయి. దీంతో షారుక్ రికార్డును ప్రభాస్ బద్దలుకొట్టినట్లైంది. వసూళ్ల వర్షం కురిపిస్తున్న కల్కి చిత్రం విజయంతోపాటు ఈ రికార్డు కూడా రావడంతో డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

hero prabhas movie kalki 2898 ad create new record in book my show ticket sales

కర్ణుడిగా అలరించిన ప్రభాస్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రరాజాన్ని నిర్మించారు. ఇతిహాసాలకు పైన్స్ ఫిక్షన్ ను లింకు పెట్టడం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణంతోపాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోలు ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించడం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముందునుంచి భైరవగా సందడి చేసిన ప్రభాస్ సినిమా చివరలో కర్ణుడిగా కనిపించి రెండోభాగంపై అంచనాలు భారీగా పెంచాడు. రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందా అనే ఉత్కంఠతో ప్రేక్షకులు ఉండగా వారికి తోడుగా అమితాబ్ కూడా రెండో భాగంపై అత్యంత ఆసక్తి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+