ఇండియాలో అత్యధికంగా ట్యాక్స్ కడుతున్న తెలుగు స్టార్ హీరో
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్. ప్రస్తుతం చిరంజీవినే మించిపోయిన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఒక్కో సినిమాతో తనని తాను మార్చుకుంటూ విలక్షణ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నారు.
RRR షూటింగ్ పూర్తయిన వెంటనే గేమ్ ఛేంజర్ సినిమా ప్రారంభమైంది. మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మధ్యలో శంకర్ భారతీయుడు2 చిత్రం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించారు. దీంతో అనివార్యంగా ఇది వాయిదా పడింది. వచ్చే ఏడాదైనా ఈ సినిమా విడుదలవుతుందా. లేదా? అనే సందిగ్ధత అభిమానులను వెంటాడుతోంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.

రామ్ చరణ్ మాత్రం ఇండస్ట్రీలో తక్కువ రేమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ఆయన ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. పలు బిజినెస్ ల ద్వారా ఆదాయం సమకూరుతోంది. చరణ్ కి తన తండ్రి ఆస్తితో పాటు ఉపాసన ఆస్తి కూడా కలిసి వచ్చింది. ఆయన సొంత ఆస్తి 1370 కోట్ల రూపాయలుగా ఉంది. ఒక్కో సినిమాకి 50 నుంచి 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఓ విమానయాన సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. కొణిదెల ప్రొడక్షన్ సంస్థకు కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. ఇలా పలు ప్రకటనలు, సినిమాలతోపాటు వ్యాపారాల పరంగా తన ఆస్తి రూ.1375 కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో అత్యధికంగా టాక్స్ కడుతున్న సెలబ్రిటీలలో రామ్ చరణ్ ఒకరిగా ఉన్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications