గుర్తు పట్టలేనంతగా మారిపోయిన రవితేజ..ఇలా ఉన్నాడేంటీ..?
ఈ ఫొటోలో ఉన్న హీరోను గుర్తు పట్టారా..? సరిగ్గా ఒక్క సెకన్ ఆగి చూస్తే కానీ ఆ హీరో ఎవరో గుర్తు పట్టడం కాస్తా కష్టమే.ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో కాదు.. మాస్ రాజా రవితేజ.తెలుగు ఇండస్ట్రీలో రవితేజ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన రవితేజ , ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్టుగా మారి పలు సినిమాల్లో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'నీకోసం' సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన రవితేజ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు.
ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు. గతంలో రవితేజ పలు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు, తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టులుగా నటించారు. అందరి హీరోల అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీనిస్తున్నారు.అయితే గత కొంతకాలంగా రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి.

'ధమాకా' సినిమా తప్పిస్తే, ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో రవితేజ జోరు కాస్తా తగ్గినట్టే కనిపిస్తోంది. మార్కెట్ ఆయన డిమాండ్ కూడా పడిపోయింది. ఇదే సమయంలో రవితేజ ఫేస్‌లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రవితేజకు వయస్సు మీద పడినట్టు ఆయన ఫేస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా రవితేజకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది.ఈ ఫొటోలో రవితేజను గుర్తు పట్టడం చాలా కష్టంగా మారింది.
రవితేజ లుక్ మొత్తం మారిపోయింది. అయితే ఇది సినిమాలో లుక్కా లేదా నిజంగా రవితేజ బయట అలా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
-
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !!











Click it and Unblock the Notifications