చిరంజీవికి ఊహించనిరీతిలో భారీ షాక్ ఇచ్చిన రవితేజ
మెగాస్టార్ చిరంజీవికి ఎనర్జిటిక్ స్టార్ రవితేజ ఊహించనిరీతిలో షాక్ ఇచ్చాడు. మొదటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండేవి. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలు చేసిన రవితేజ మెగాస్టార్ అన్నయ్య సినిమాలో తమ్ముడిగా ఓ పాత్ర పోషించారు. ఇటీవలే బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య సినిమాలో కూడా కలిసి నటించారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను డిసెంబరులో అనుకొని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
గేమ్ ఛేంజర్ కు పోటీ అవకూడదని
ఆ సినిమాకు పోటీ అవకూడదనే ఉద్దేశంతో తన విశ్వంభరను అప్పుడే విడుదల చేయాల్సివున్నా మే 9వ తేదీకి వాయిదా వేయించారు చిరంజీవి. అయితే ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే పేరుతో సినిమా చేస్తున్నారు. సితార బ్యానరులో భాను భోగవరాజు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. దీన్ని కూడా మే 9వ తేదీనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం చిరంజీవి అభిమానులెవరికీ నచ్చలేదు. ఒకరికొకరు మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో హీరోలంతా పరిశ్రమలో సహకరించుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో చిరంజీవికి పోటీగా సినిమా చేయడం ఎందుకు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

రవితేజపై మండిపడుతున్న చిరు
ఈ విషయంపై చిరు అభిమానులు రవితేజపై మండిపడుతున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ మధ్యకాలంలో ఏవైనా హిట్ సినిమాలు కొట్టాడా? అంటే అవి క్రాక్, ధమాకా అని చెప్పొచ్చు. ఈగిల్, ఖిలాడి, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్.. ఇలా సినిమాలన్నీ వరుస ఫ్లాపులే. మిస్టర్ బచ్చన్ అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. పోటీగా సినిమా విడుదల చేయకుండా ఏ సినిమాలు లేని సమయం చూసుకొని విడుదల చేస్తే వచ్చే కలెక్షన్లతో నిర్మాతలు కూడా సంతోసిస్తారని, ఈ ప్రయత్నాన్ని ఆపాలంటూ చిరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రవితేజ, సితార బ్యానరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications