Sai Dharam Tej: మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న సాయిధరమ్ తేజ్.. వైరల్ అవుతోన్న వీడియో..
మెగాస్టార్ మేన అల్లుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి తెలియని వారు ఉండరు. ఆయన రెండున్నర సంవత్సరాల క్రితం సాయి బైక్ పై వెళ్తుంటే రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు ఓ యువకుడు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చాడు. అతను చేసిన సాయన్ని సాయి ధరమ్ తేజ్ మర్చిపోలేదు. ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఎవరైన మనకు సాయం చేస్తే.. మనం ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఆ మాటనే నిజం చేశాడు సాయి ధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తన సాయంతో ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడాడు.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ లో చాలా మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. సోషల్ సర్వీస్ లో ఆయన ముందుంటున్నాడు. రీసెంట్ గా తేజ్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. అనాథ ఆశ్రమంలో ఉన్న ఇద్దరు చిన్నారులకు సాయం చేశారు. వారి వైద్య ఖర్చులను సాయి ధరమ్ తేజ్ చెల్లించాడు. ఈ విషయనాన్ని సినిమా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

సూర్యాపేట జిల్లాలో చార్లెట్ అనా అనాథ ఆశ్రమం ఉంది. ఇందులో ఉండే ఇద్దరు పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారు. వారికి చికిత్స చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. ఆశ్రమం నిర్వహకులు ఇద్దరు పిల్లల ట్రీట్‌మెంట్ కోసం సాయం కోరుతూ తనను సంప్రదించినట్లు అండ్రూ బాబు చెప్పారు. తనకు వెంటనే సాయి ధరమ్ తేజ్ పేరు గుర్తుకు వచ్చిందన్నాడు. వెంటనే సాయి ధరమ్ తేజ్ మెసేజ్ చేసినట్లు గుర్తు చేశాడు.
తన మెసేజ్ కు స్పందించిన సాయిధరమ్ తేజ్ వెంటనే ఆర్థిక సాయం చేశారని అండ్రూ తెలిపారు. తమకు సాయి ధరమ్ తేజ్ చేసిన హెల్ప్ కు పిల్లలు కృతజ్ఞత చెప్పుతూ ఓ వీడియో కూడా పంపినట్లు అండ్రూ బాబు వివరించారు. సాయిధరమ్ తేజ్ ఇప్పుడే కాదు.. గతంలో కూడా చాల మందికి హెల్ప్ చేశారు. విజయవాడలో వృద్ధుల కోసం ఓ బిల్డింగ్ నిర్మించాడు. గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లోని సైనిక కుటుంబాలకు రూ.20 లక్షలు సాయం చేశారు.
Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7
— I.Andrew babu (@iandrewdop) February 22, 2024
సాయిధరమ్ తేజ్ చేసిన హెల్ఫ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భవిష్యత్త్ లో ఎన్నో విజయాలు సాధించింది ఇలానే సాయం చేయాలని కోరుకుంటున్నారు. ఎంతైనా.. సాయిధరమ్ తేజ్ పెద్ద మనస్సుకు మనం కూడా మెచ్చుకోవాల్సిందే.












Click it and Unblock the Notifications