సూర్య ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరో మాజీ భార్య... బాలయ్యకు చెప్పిన కార్తీ
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో 4 చేస్తున్నారు. దీనికి అతిథులుగా అల్లు అర్జున్, సూర్య తదితరులు వస్తున్నారు. తాజాగా తెలుగు, తమిళంలో విశేషమైన అభిమానులను సంపాదించుకున్న సూర్య వచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలతో బాలయ్య సూర్యను ఉక్కిరి బిక్కిరి చేశారు. సూర్య రాగానే ఈ షోకు ఎంత పెద్ద హీరో వచ్చినా సమాధానాలు మాత్రం నిర్మొహమాటంగా చెప్పాల్సి ఉంటుందని, తాను కూడా అంతే నిర్మొహమాటంగా అడుగుతానని బాలయ్య చెప్పారు. సూర్య నిజ జీవితంలోని కొన్ని సంఘటనలను, మరికొన్ని ఆసక్తికర ఘటనలను ఈ షో ద్వారా పంచుకున్నారు.
14న విడుదల కాబోతున్న కంగువ
ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న సూర్య ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ అన్ స్టాపబుల్ షోకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 14 భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈనెల 14వ తేదీన విడుదల కాబోతోంది. మొదటిగా పూర్తి పేరు అడిగితే శరవణన్ అని చెప్పాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాతే తన పేరు సూర్యగా మారిందన్నారు. జీవితంలో మొదటి క్రష్ ఎవరు అని బాలయ్య అడగ్గా దానికి సూర్య సమాధానం చెప్పలేదు. సిగ్గుపడ్డాడు. రెండుసార్లు అడిగినప్పటికీ సమాధానం దాటవేస్తుండటంతో సూర్య తమ్ముడైన కార్తీకి బాలయ్య ఫోన్ చేశాడు.

కమల్ హాసన్ మాజీ భార్య గౌతమి
విశ్వనటుడు కమల్ హాసన్ మాజీ భార్య గౌతమి సూర్య మొదటి క్రష్ అని కార్తీ చెప్పాడు. జెంటిల్ మెన్ సినిమాలో చికుబుకు రైలే పాట చేసినప్పుడు అది చూసి అప్పటి నుంచి తన మొదటి క్రష్ గా గౌతమిని మార్చుకున్నాడని వివరించాడు. దీంతో నవ్విన సూర్య ఈ షోకు కార్తీ వచ్చినప్పడు తనకు తప్పకుండా ఫోన్ చేయమని అడిగాడు. గౌతమి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటారు. జాతీయ నటిగా పేరు తెచ్చుకోవడంతోపాటు తన అందంతో ఎందరినో ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం కమల్ హాసన్ నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగా జీవిస్తున్నారు. తన భార్య జ్యోతిక తన జీవితానికి ఫిలాసఫర్ అని చెప్పారు సూర్య. వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి అందరికీ తెలిసిందే. వివాహమైన తర్వాత ఇంతవరకు వీరిద్దరి మధ్య ఒక్క చిన్న గొడవ కూడా జరగలేదంటే ఒకర్నొకరు అర్థం చేసుకుంటూ ఎలా జీవిస్తున్నారో ఇతరులకు ఆదర్శనీయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications