ఆ హీరోయిన్ నెంబరును బ్లాక్ చేసిన విజయ్ దేవరకొండ?

తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి నుంచి సహకారం తీసుకోకుండా తన స్వయంశక్తితో సూపర్ స్టార్ గా ఎదుగుతున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడమేకాదు.. అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన పాన్ ఇండియా చిత్రం లైగర్ పరాజయం పాలైందికానీ ఆ సినిమాకానీ హిట్ అయ్యుంటే విజయ్ ఎక్కడో ఉండేవాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్లలో ఒకడైపోయేవాడు.

లైగర్ తర్వాత పూరీతోనే జణగణమణ పేరుతో మరో సినిమా చేయాల్సి ఉంది. లైగర్ ఫ్లాపవడంతో అది వెనక్కిపోయింది. అప్పటికే 20 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. అందులో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఎంపిక చేశారు. అయితే సినిమా ఆగిపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. జణగణమణ సినిమాకు పూజానే హీరోయిన్ గా కావాలంటూ విజయ్ పట్టుబట్టి ఎంపిక చేయించాడు. తాజాగా తెలుగులో ఫ్యామిలీస్టార్ సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది. మొదటగా ఈ సినిమాలో కూడా పూజానే హీరోయిన్ గా అనుకున్నారు.

hero vijay devarakonda block the pooja hegde phone number

అయితే మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. వరుసగా రెండు అవకాశాలు పూజాకు దూరమయ్యాయి. రెండుసార్లు తనను నమ్మించి ముంచేశావంటూ విజయ్ దేవరకొండకు పూజా కోపంగా మెసేజ్ లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె నుంచి వస్తున్న టార్చర్ ను భరించలేక పూజా నెంబరును విజయ్ బ్లాక్ చేశాడంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఈ వార్త నిజమైతే పూజాకు హీరోయిన్ గా రెండుసార్లు అవకాశం ఇవ్వకుండా విజయ్ దేవరకొండ ఇతర హీరోయిన్లవైపు చూస్తున్నాడంటున్నారు. ప్రస్తుతం పూజా ఫామ్ లో లేకపోవడం కూడా ఆమెకు మైనస్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+