మనల్ని ఆపేదేలే.. విజయ్ దేవరకొండ సవాల్!.. యాటిట్యూడ్ మారలేదు!!
భగవంతుడు ఈ సృష్టిలో ఎవరికీ ఇవ్వని అరుదైన అవకాశాన్ని మానవులకే ఇచ్చాడు. అదే మాట. భూమి మీద 84 లక్షల కోట్ల రకాల జీవరాశులున్నాయి. వీటిల్లో కేవలం మాట్లాడగలిగేది మానవుడొక్కడే. అటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మాట అనేది ఆచితూచి వాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. సాత్వికమైన మాటలే రావాలి. ఎదుటివారిని నొప్పించే విధంగా, తనలోని అహంకారం బయటకు వచ్చేవిధంగా మాట ఉండకూడదు. అలా ఉంటే సమాజం అతన్ని దూరంగా పెడుతుంది. అందుకే తూటా లాంటి మాట నోట్లో నుంచి వచ్చే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అయితే దురదృష్టవశాత్తూ తెలుగులో కథానాయకుడిగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ మాత్రం నోరు అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.
తాను టాప్ లోకి వెళ్లి కూర్చోవడమే
తన యాటిట్యూడ్ తో ఇప్పటికే చాలామంది అభిమానులను దూరం చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోలు, అగ్ర హీరోల అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. అయినా అతను మారలేదని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్ డం ఈనెల 31వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాతో తాను తెలుగులో టాప్ హీరో అవడం ఖాయమని చెప్పాడు. అంతేకాదు.. తిరుపతిలో జరిగిన సినిమా ముందస్తు విడుదల వేడుకలో విజయ్ మాట్లాడుతూ ఈ సినిమాతో తాను టాప్ లో వెళ్లి కూర్చోవడం ఖాయమన్నారు. తాను చాలా పెద్దవాడినైపోతానన్నారు. ప్రేక్షకుల ఆశీస్సులతోపాటు వెంకన్నస్వామి దయ ఉంటే తనను ఆపేవారే లేరన్నారు.

ఆత్మవిశ్వాసంతో ఉంటే మంచిదే..
సినిమా మీద ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం వరకు బాగుంటుంది. కాకపోతే అది అతి కాకుండా చూసుకోవాలి. లైగర్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా ఇలాగే మాట్లాడటంతోపాటు యాటిట్యూడ్ కూడా అసలు బాలీవుడ్ వారికి నచ్చలేదు. కాలిమీద కాలు వేసుకొని కూర్చోవడంతోపాటు కాళ్లు ఊపుతూ మాట్లాడటం, అటువైపు పెద్దవారున్న తనిష్టమొచ్చినరీతిలో యాటిట్యూడ్ చూపడంతో ఎవరూ అతన్ని ఇష్టపడలేదు. వ్యక్తిత్వం బాగుంటే సహజంగానే మన మైండ్ సెట్ మారుతుంది. అందుకనుగుణంగా కథలను ఎంచుకొని హిట్ కొడతాం. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తప్పితే ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఆడలేదు. కింగ్ డం ఆడుతుందనే నమ్మకంతో విజయ్ ఉన్నాడు. చూద్దాం.. ఏమవుతుందో?.












Click it and Unblock the Notifications