న్యూస్ ఛానెల్ పెడుతున్న తెలుగు స్టార్ హీరో... త్వరలో రాజకీయాల్లోకి?

ఒకప్పుడు వార్తాపత్రికలుకానీ, వార్తా ఛానెళ్లుకానీ తటస్థంగా ఉండి ఉన్న వార్తను ఉన్నట్లుగా ప్రేక్షకులకు అందించేవి. దీంతో ప్రజలు ప్రభుత్వంపై, రాజకీయ పార్టీలపై ఒక అభిప్రాయానికి వచ్చేవారు. క్రమేణా ఈ పద్ధతి మారుతూ వచ్చింది. వ్యాపారస్తులు మీడియా సంస్థలను ఏర్పాటు చేయడం, ఉన్నవాటిని కొనుగోలు చేయడంతోపాటు వారికి ప్రభుత్వాలతో పని ఉండటంతో మీడియా పనితీరుతూ క్రమేపీ మారుతూ వచ్చింది. ఏదో ఒక మీడియా సంస్థ, ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అనివార్యంగా కూడా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతోంది? అనే విషయం తెలుసుకోవడంలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

మీడియా అండగా లేదని విజయ్ భావన
ఇటువంటి అయోమయాన్ని నిర్మూలించి తనకంటూ ఓ వార్తా ఛానెల్ ఉండాలని తమిళ ఇళయ దళపతి విజయ్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మీడియా తన వార్తలను ప్రసాదరం చేయడంలో అంత ఆసక్తి చూపిస్తున్నట్లుగా లేవనే ఆలోచనలో ఉన్న విజయ్ తన పార్టీ 'తమిళగ వెట్రి కళగంకు' అనుబంధంగా ఓ ఛానెల్ ప్రారంభించబోతున్నారు. దీనివల్ల తాను ఏం మాట్లాడాను అనే విషయాన్ని ఎడిటింగ్ లేకుండా పూర్తిగా ప్రజల్లోకి వెళుతుందని, తద్వారా అసలు విషయంపై వారికి అవగాహన వస్తుందనేది విజయ్ యోచనగా ఉంది. అందుకే ఆయన న్యూస్ ఛానెల్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తనకు అండగా తమిళంలో సరైన మీడియా సంస్థలు లేవని విజయ్ భావిస్తున్నారు.

Hero Vijay will launch news channel named Channel V

తన పేరులోని 'వి'తో పేరు పెట్టాలని
పార్టీని ప్రకటించిన తర్వాత ఓ బహిరంగ సభను విజయ్ పెట్టారు. తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. రాజకీయాల కోసం తన సినీ కెరీర్ ను కూడా త్యాగం చేశారు. ఒప్పుకున్న రెండు సినిమాలను పూర్తిచేసిన తర్వాత సినిమాలు చేసే అవకాశం లేదు. త్వరలోనే పార్టీ పేరులో ఓ చిన్న మార్పు చేయాలని భావిస్తున్న 'తమిళగ వెట్రి కళిగం' అనే పేరులో 'క్' అనే అక్షరాన్ని చేర్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లాలవారీగా పార్టీ అధ్యక్షులతో, అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఛానెల్ పేరును తన పేరులోని 'వి' కలిసివచ్చేలా పెట్టబోతున్నారు. బహుశా 'ఛానెల్ వి' అని ఉండొచ్చని అనుకుంటున్నారు. ఏం పేరు పెట్టనున్నారనేది త్వరలోనే తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+