రిలేషన్ షిప్‌పై ఓపెన్ అయిన హీరో విశాల్.. ఆ హీరోయిన్ తోనే పెళ్లి ఫిక్స్ !
కోలీవుడ్ లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇన్నాళ్లు తన రిలేషన్ షిప్ పై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. అఫిషియల్ గా అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నట్టు.. తమ వివాహం ఆగస్టు 29న జరగనున్నట్టు ప్రకటించేశారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈవెంట్ వేదికగా అనౌన్స్‌మెంట్..
ధన్సిక నటించిన యాక్షన్ మూవీ 'యోగీ దా' ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశాల్ అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం జరగడానికి ముందే వారి రిలేషన్ షిప్ పై వార్తలు జోరందుకున్నాయి. ఈ వేడుకలోనే ఆ విషయాని ప్రకటిస్తారని కూడా విశాల్ సన్నిహితులు చెబుతూ వచ్చారు. అయితే అంతా అనుకున్న ప్రకారమే తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. పెళ్లి తేదీని సైతం వెల్లడించారు. తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు.

సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి అని తాము కలిసి అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నామని విశాల్ తెలిపారు. అలానే పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుందని చెప్పారు. ధన్సిక సైతం మాట్లాడుతూ.. కొంతకాలం క్రితం తమ మధ్య పరిచయం మొదలైందని.. అది ప్రేమగా మారిందని స్పష్టం చేశారు. విశాల్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
గతంలోనూ రూమర్స్..
విశాల్ పెళ్లిపై చాలాకాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. గతంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌తో ఆయన ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించిన అభిరామిని, హీరోయిన్ లక్ష్మీ మీనన్ ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌మీడియా కోడై కూసింది. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ ఆయన ఇప్పుడు పెళ్లి ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది.
నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తయ్యాకే..
గతంలో నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని విశాల్ ప్రకటించారు. ఇటీవల ఆ బిల్డింగ్ పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. తన జీవిత భాగస్వామిని కనుగొన్నానని.. ఇప్పటికే పెళ్లి గురించి వారి మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తప్పకుండా ప్రేమ వివాహమేనని త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని తెలిపారు.
Tamil hero #Vishal announced his marriage with #SaiDhanshika ! pic.twitter.com/4K6cYV1jbg
— North East West South (@prawasitv) May 20, 2025












Click it and Unblock the Notifications