అవార్డు ఇస్తే డస్ట్ బిన్ లోకే.. 8 మంది ఎలా నిర్ణయిస్తారు ?
నటుడు విశాల్ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. రీసెంట్ గా చేసిన కామెంట్స్ ఫిల్స్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఏం జరిగిందంటే..?
విశాల్ ట్విట్టర్ వేదికగా.. యువర్స్ ఫ్రాంకీ విశాల్ పేరుతో ఒక పాడ్ కాస్ట్ మొదలు పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ.. 8 కోట్ల మందికి ఏం నచ్చుతుందో 8 మంది నిర్ణయించలేరు కదా అంటూ ఘాటుగా తెలిపారు. అవి ఏ అవార్డులు అయినా కానీ 8 కోట్ల మంది అభిప్రాయాలను 8 మంది ఎలా నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. తనకు అవార్డులు రావు కాబట్టి అలా అంటున్నారని అనుకోవచ్చని.. కానీ తాను అలా అనడం లేదని స్పష్టం చేశారు.

అంతే కాకుండా విశాల్.. తనకు ఏవైనా అవార్డులు వస్తే ఆ అవార్డులను చెత్తబుట్టలో వేస్తానన్నారు. ఒకవేళ బంగారంతో చేసిన అవార్డులను ఇస్తే వాటిని అమ్మి వచ్చిన ఆ డబ్బులను ఛారిటీకి విరాళంగా ఇస్తానని మాట్లాడడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ విశ్లేషకులు సైతం ఈ మాటలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇన్నాళ్లు తన రిలేషన్ షిప్ పై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. అఫిషియల్ గా అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నట్టు.. ప్రకటించేశారు. విశాల్ పెళ్లిపై చాలాకాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. గతంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌తో ఆయన ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించిన అభిరామిని, హీరోయిన్ లక్ష్మీ మీనన్ ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌మీడియా కోడై కూసింది. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ ఆయన ఇప్పుడు పెళ్లి అనౌన్స్ చేశారు. రీసెంట్ గానే వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ











Click it and Unblock the Notifications