ఆ హీరోయిన్స్ కంటే మీరు తక్కువేం కాదు: యాంకర్ పై విశ్వక్ సేన్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో రోజురోజుకు కుర్ర హీరోలు ఎక్కువైపోతున్నారు. వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. నటించింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం స్టార్ హీరోలకు తగ్గకుండా ఉంది. అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ కు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. దీన్ని విశ్వక్ సేన్ అభిమానులతోపాటు నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు.

యాంకర్ స్రవంతిని విశ్వక్సేన్ తెగ పొగిడేశాడు. చాలా బాగుంది అంటూ ఆ వీడియోలో స్రవంతి ఏదో చెప్పబోయింది. అయితే ఇంతలోనే విశ్వక్ అందుకొని ఈ మధ్య హీరోయిన్లకన్నా మీరు మంచి చీరలు కడుతున్నారంటూ పొగిడాడు. దీనికి ఆమె నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పింది. దీన్ని చూసినవారంతా ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఆమెపై నీ కన్ను పడిందా? అంటూ కామెంట్ చేస్తుండగా మరికొందరు ఇకనుంచి ఆమె షోలు వచ్చినట్లే అంటున్నారు.

hero vishwaksen comments on achor sravanthi saree

విశ్వక్ సేన్ నటుడే కాకుండా దర్శకుడు, స్క్రీన్ రైటర్ కూడా. 2017లో వెళ్లిపోమాకే చిత్రంతో నటుడిగా, 2019లో ఫలక్‌నుమా దాస్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు . ఈ నగరానికి ఏమైంది, HIT ది ఫస్ట్ కేస్, ఓరి దేవుడా తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. 1995 మార్చి 29న జన్మించిన విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. న్యూమరాలజీ ప్రకారం విశ్వక్ సేన్ అని పేరు మార్చుకున్నాడు. మై కడవులే అనే తమిళ చిత్రానికి రీమేక్ గా ఓరి దేవుడా చిత్రం చేశాడు. దాస్ కా ధమ్కీలో ద్విపాత్రాభినయంతో అలరించారు. గామి చిత్రంలో అఘోరాగా కనిపించబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+