Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు స్టార్ హీరోయిన్ తో నిర్మాత రెండోపెళ్లి?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ, తమిళ చిత్ర పరిశ్రమలోకానీ తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను సృష్టించుకున్నారు కథానాయిక అంజలి. తెలుగు సినిమాలకన్నా తమిళ సినిమాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. రామ్ దర్శకత్వంలో వచ్చిన కరతు తమిళ్ సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.

తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించిన సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. తర్వాత జర్నీ సినిమా చేసింది. ఆ సినిమా చేసిన సమయంలోనే హీరో జైతో ప్రేమలో పడిందని.. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ గా మారాయి. తామిద్దరం కేవలం స్నేహితులమేనని వారిద్దరూ స్పష్టం చేశారు. ప్రేమ, పెళ్లి గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడని అంజలి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పింది.

heroine anjali will marry with divorce producer

ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉండటం వల్లే కెరీర్ పై శ్రద్ధ పెట్టలేకపోయానని, రాంగ్ రిలేషన్ షిప్ అని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. రిలేషన్ షిప్ కన్నా కెరీర్ కు ప్రాధాన్యత ఇవ్వడమే జీవితంలో ప్రధానమని తెలిపింది. తాజాగా అంజలి గురించి ఓవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తెలుగు నిర్మాతతో గత సంవత్సరం నుంచి డేటింగ్ లో ఉందని, కొద్దిరోజుల్లోనే వీరిద్దరూ ఏడడుగుల బంధంతో ఒకటవ్వనున్నారనేది ఆ వార్త సారాంశం.

సదరు నిర్మాతకు ఇప్పటికే వివాహమైంది.. విడాకులు కూడా తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియదుకానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది. గీతాంజలి, వకీల్ సాబ్ చిత్రాలు కూడా అంజలికి మంచిపేరు తెచ్చిపెట్టాయి. తెలుగమ్మాయికి మాత్రం తెలుగులో అవకాశాలివ్వరంటూ ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+