ప్రభాస్ ను కలిసిన అనుష్క వాళ్ల నాన్న
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రభాస్-అనుష్క ది హిట్ పెయిర్. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ కాంబినేషన్ పై పరిశ్రమలో రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది. మరిన్ని సినిమాలు రావాలని ఇద్దరి అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ప్రభాస్ ను అనుష్క వాళ్ల నాన్న కలిశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
డీలా పడ్డ అభిమానులు : ఇద్దరూ ఏదన్నా శుభవార్త చెబుతారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అప్ డేట్ ఏమైనా వస్తుందేమో అనుకున్నారుకానీ ఎటువంటి వివరాలను వారు ప్రకటించలేదు. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకుమించి తమ మధ్య ఏదీ లేదని వేర్వేరు సందర్భాల్లో ప్రభాస్, అనుష్క చెప్పారు. ప్రభాస్ నుంచి కానీ, అనుష్క వాళ్ల నాన్న నుంచి కానీ ఎటువంటి వార్త రాకపోయేసరికి అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.

భారీగా పారితోషికం : ప్రభాస్, అనుష్క పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు. కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ సినిమాలన్నీ భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభాస్ కు మరిన్ని విజయాలు దక్కడం గ్యారంటీ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
పాన్ ఇండియా హీరో : ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. దక్షిణాదిలో ఎంతమంది అభిమానులున్నారో ఉత్తరాదిలో అంతకు మించిన సంఖ్యలో అభిమానులుండటం విశేషం. డార్లింగ్ ను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరని అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఈ ఏడాది సలార్ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే సంచలనాలు సృష్టించింది. అక్టోబరు 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కానుకగా సలార్ ట్రైలర్ రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications