ప్రభాస్ పేరును అక్కడ ట్యాటూ వేయించుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు. సాహో, ఆదిపురుష్ , రాధేశ్యామ్ సినిమాలతో నిరాశ పర్చినప్పటికి , సలార్, కల్కి సినిమాలతో వరుస సినిమాలతో హిట్ కొట్టి తన రేంజ్‌ను మరోసారి రుజువు చేసుకున్నాడు.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సినిమా మొదటి వారంలోనే రూ.500 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకునే, అమీతాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.

కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేది కల్కి కథ. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పేరును బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ట్యాటూ వేయించుకుందనే ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు దిశా పటానీ.
కల్కి సినిమాలో దిశా పటానీ ఓ కీలక పాత్రలో కనిపించింది. దిశా పటానీ ప్రభాస్‌తో ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. దిశా పటానీ చేతిపై పీడీ' టాటూ కొత్తగా కనిపిస్తోంది. . 'పీడీ అంటే ప్రభాస్, దిశా' అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రభాస్ తో తన ప్రేమకు గుర్తుగా దిశా పటానీ ఈ టాటూ వేయించుకున్నారని చాలామంది నెటిజన్లు ఊహించుకుంటున్నారు. ఆ ట్యాటూపై దిశా పటానీ కార్లిటీ ఇచ్చే వరకు ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తునే ఉంటాయి.












Click it and Unblock the Notifications