విడాకుల బాట పట్టిన మరో హీరోయిన్..పెళ్లైన రెండేళ్లకే మొగుడికి గుడ్ బై
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఓ హీరోయిన్ పెళ్లైన రెండేళ్లకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..అపర్ణ వినోద్. తెలుగు ప్రేక్షకులకు అపర్ణ వినోద్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ, మలయాళ తమిళ ప్రేక్షకులకు ఈ భామ సుపరిచితమే.

అపర్ణ వినోద్ తన నటనా ప్రస్థానాన్ని మలయాళ సినిమాల్లో ప్రారంభించి, తర్వాత తమిళ సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. "కోహినూర్" మరియు "బైరవా" వంటి చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.చిన్నతనం నుండి నృత్యంపై ఆసక్తి ఉన్న అపర్ణ, మొహినియాట్టం నర్తకిగా కూడా ప్రసిద్ధి. అపర్ణ వినోద్ మనస్తత్వ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.సినిమా రంగంలో ఎంతో గుర్తింపు దక్కించుకున్నఅపర్ణ, వైవాహిక జీవితంలో మాత్రం తీవ్ర విమర్శలను ఫేస్ చేసింది.
2022 అక్టోబర్‌లో రినిల్ రాజ్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. 2023 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. అయితే పెళ్లైన రెండేళ్లకే భర్త రినిల్ రాజ్‌తో విడిపోతున్నట్లు అపర్ణ వినోద్ స్వయంగా ప్రకటించింది. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది.విడాకులు తీసుకుంటున్నామని చెప్పిన అపర్ణ వినోద్ , దానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications