ఫ్రెండ్ భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు.
తాజాగా ఓ హీరోయిన్ ఎఫైర్ బయటపడింది. ఏకంగా స్నేహితురాలే భర్తతోనే ఎఫైర్ పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ బ్యూటీ మరెవరో కాదు.. అమృతా అరోరా. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా సోదరిగా గుర్తింపు పొందిన అమృతా అరోరా కేవలం నటిగానే కాకుండా మోడల్, టీవీ ప్రజెంటర్, వీజేగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. బాలీవుడ్ సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించిన అమృత, 2015 వరకు సినీ పరిశ్రమలో చురుకుగా ఉంది.

అమృత వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో నిలిచింది. 2004లో పాకిస్థానీ సంతతికి చెందిన ఇంగ్లండ్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్‌తో ఆమె రిలేషన్‌షిప్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రేమ వ్యవహారంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా మాట్లాడింది కూడా. అయితే, ఉస్మాన్‌తో విడిపోయిన తర్వాత, అమృత వ్యాపారవేత్త షకీల్ లడక్‌ను వివాహం చేసుకుంది. షకీల్‌కు అప్పటికే పెళ్లై ఉండటం, అతని మొదటి భార్య నిషా, అమృతకు బెస్ట్ ఫ్రెండ్ కావడం గమనార్హం. అంతేకాదు, పెళ్లికి ముందే అమృత గర్భం దాల్చింది. ప్రస్తుతం షకీల్ లడక్‌తో కలిసి జీవిస్తున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమృత జీవితం ఆమె బోల్డ్ పర్సనాలిటీకి అద్దం పడుతుంది.












Click it and Unblock the Notifications