హోటల్ గదిలో హీరోయిన్..బాయ్‌ఫ్రెండ్‌తో అలా కనిపించడంతో
సురేఖ వాణి... పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల్లో నటి సురేఖ వాణి కూడా ఒకరు. క్యారెకర్ట్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించి సురేఖ వాణి మంచి గుర్తింపు తెచ్చుకున్నామె. అక్కగా, వదినగా, తల్లిగా తన నటనతో సురేఖ వాణి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సురేఖ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సురేఖ వాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
కూతురు సుప్రితతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్‌ను ఏరకంగా మెయిన్‌టైన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపొగొడుతుంటుంది. కూతురు సుప్రిత కెరీర్‌ను సెట్ చేయడానికి సురేఖ వాణి గట్టిగానే కష్టపడుతుంది.

సుప్రిత ప్రస్తుతం ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్‌తో కలిసి ఓ సినిమా చేస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సుప్రితకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుప్రిత తాజాగా తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
సుప్రిత ఇటీవల చెన్నైకు వెళ్లింది. అయితే ఆమె ఒంటరిగా కాకుండా ఓ ఫ్రెండ్‌తో కలిసి అక్కడకు వెళ్లింది. వీరిద్దరు ఒకే గదిలో ఉన్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాకు ఆరోగ్యం బాగోలేక పోయినా కొంచెం కూడా జాలి లేదని .. ఫోన్ చూస్తున్నాడు అని వీడియోలో సుప్రీత చెప్పుకొచ్చింది. వీడియాలో ఉన్న వ్యక్తి సుప్రీత బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతను బెస్ట్ ఫ్రెండ్ కాదు ప్రియుడని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications