హీరోయిన్ మెటీరియల్ ..పిచ్చిది రైల్వే స్టేషన్‌లో రీల్స్ చేసుకుంటుంది
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా దగ్గర కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీలలో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నమైంది ఖ్యూ మధు( q.madhu)
సోషల్ మీడియా ప్రపంచంలో ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. అలాంటి వారిలో తనదైన ప్రత్యేక శైలి, క్యూట్ లుక్స్‌తో యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది హైదరాబాద్ గర్ల్ ఖ్యూ మధు. ఒక సాధారణ అమ్మాయి నుంచి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న స్టార్‌గా ఎదిగిన ఖ్యూ మధు ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.

ఖ్యూ మధు అంటే గుర్తొచ్చేది ఆమె హావభావాలు, నవ్వు. ఆమె ప్రధానంగా రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు పాటలు, సంభాషణలకు అనుగుణంగా ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించే ముఖ కవళికలను, సహజమైన నటనను ఖ్యూ తన వీడియోల్లో ప్రదర్శిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఖ్యూ మధుకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె పోస్ట్ చేసిన ప్రతి వీడియో క్షణాల్లో వేల సంఖ్యలో లైక్స్, కామెంట్లు సంపాదించుకుంటుంది. ఆమె ట్రెండీ అవుట్‌ఫిట్లు, ఫ్యాషన్ సెన్స్ కూడా యువతకు ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తోంది. ఆమె సింపుల్, క్యూట్ లుక్స్... ప్రేక్షకులను అమాంతం ఆకర్షిస్తాయి.
ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు అడుగులు? సోషల్ మీడియాలో ఈ స్థాయిలో స్టార్‌డమ్ దక్కించుకున్న తర్వాత, సహజంగానే సినీ పరిశ్రమ దృష్టి ఆమెపై పడింది. ఖ్యూ మధుకి ఇప్పటికే పలు మ్యూజిక్ వీడియోలలో, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశాలు దక్కాయి. త్వరలోనే ఆమె పెద్ద తెరపై కూడా మెరిసే అవకాశం ఉందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
సొంత టాలెంట్‌తో సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని, డిజిటల్ స్టార్‌గా ఎదిగిన ఖ్యూ మధు ప్రయాణం రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి












Click it and Unblock the Notifications