తెలుగు స్టార్ హీరోతో ప్రేమలోపడ్డ మృణాల్ ఠాకూర్.. త్వరలో పెళ్లి?

మృణాల్ ఠాకూర్ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. తన అందంతోపాటు నటనతో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీస్టార్ సినిమా చేసింది. అనుకున్న స్థాయిలో ఈ సినిమా హిట్ అవనప్పటికీ మృణాల్ నటనకు మాత్రం మంచి మార్కులు వచ్చాయి. డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయికానీ వాటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

స్టార్ హీరోతో ప్రేమలో
ప్రస్తుతం ఈమె గురించి సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరలవుతోంది. తెలుగులో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనేది ఆ వార్త సారాంశం. కొంతకాలం క్రితం కూడా ఓ తెలుగు స్టార్ హీరోతో మృణాల్ ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ అమ్మడు స్పందించలేదు. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో వార్త నిజమే అని అందరూ భావించారు. ప్రస్తుతం మరోసారి ఆమె ప్రేమ వ్యవహారం చక్కర్లు కొడుతుండటంతో ఎవరు ఆ హీరో అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

heroine Mrinal Thakur marriage with telugu star hero

చీరల్లో దిగిన ఫొటోలను షేర్ చేస్తోంది
సినిమాల్లో ఎంతో సాంప్రదాయ బద్దంగా కనిపించే మృణాల్ సామాజిక మాధ్యమాల్లో మాత్రం కురచ దుస్తుల్లో ఉండే ఫొటోలనే షేర్ చేస్తుంటుంది. తాజాగా మాత్రం చీరలో ఉన్న ఫొటోలను షేర్ చేస్తోంది. దీంతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందని నెటిజన్లంతా నిర్థారించుకుంటున్నారు. త్వరలోనే వివాహం జరగబోతోందని, అందుకే ఇలాంటి ఫొటోలతో హింట్ ఇస్తోందని భావిస్తున్నారు. ప్రభాస్ కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. బాలీవుడ్ లో పాగా వెయ్యాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. సీతారామం సినిమాలో సీత పాత్రలో ఎంతో పద్ధతిగా కనిపించి యువతను బాగా ఆకట్టుకుంది. అప్పటినుంచి ఈ అమ్మడును అటువంటి పాత్రల్లోనే చూడాలని యువత భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+