లిప్ లాక్స్ సీన్స్ వల్ల చాలా కోల్పోయా..విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలన కామెంట్స్
మృణాల్ ఠాకుర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.
మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫ్యామిలి స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

తన నటనతో మరోసారి ఆకట్టుకుంది.హాయ్ నాన్న సినిమా సైతం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.అయినప్పటికీ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇక ఇదే సమయంలో సూపర్ 30, జెర్సీ వంటి హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగుతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. తాజాగా అమ్మడు లిప్ లాక్ సన్నివేశాల గురించి కీలక కామెంట్స్ చేసింది.
కెరీర్ తొలినాళ్లల్లో ముద్దు సన్నివేశాల్లో నటించడం చూసి తన తల్లిదండ్రులు షాకయ్యారట. దీంతో ఆమె తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని కండిషన్స్ పెట్టారట.దీంతో చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని మృణాల్ తెలిపింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించానని ఈ హాట్ బ్యూటీ ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications