రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను: నయనతార

దక్షిణ భారతదేశంలో అత్యంత ఖరీదైన హీరోయిన్ నయనతార. ఆమె ఒక సినిమాకు రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. జవాన్ చిత్రంతో బాలీవుడ్ లో కూడా సంచలన విజయం అందుకున్నారు. ప్రస్తుత పారితోషికం రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్యలో ఉందని వార్తలు వస్తున్నాయి. అన్ని పరిశ్రమల్లో అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ హోదాను అందుకున్నారు. అటువంటి నయనతార ఒక హీరో పక్కన నటించడానికి మాత్రం ఆసక్తి చూపడంలేదు. అవసరమైతే తనకు రూ.100 కోట్లు ఇచ్చినా నటించనని ఖరాఖండిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వార్త తమిళ సినీ పరిశ్రమను షేక్ చేస్తోంది. రూ.100 కోట్లు కాదు.. రూ.వెయ్యి కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను అని తేల్చి చెప్పిందంట. ఆ హీరో మరెవరో కాదు లెజండ్ శరవణన్. 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కథానాయకుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. వ్యాపారవేత్తగా ఆయన కోట్లాది రూపాయలు సంపాదించారు.

heroine nayanthara not interested act the hero arun alvar

2022లో వచ్చిన ది లెజెండ్ సినిమాతో శరవణన్ హీరోగా వచ్చారు. ఆ సినిమా విడుదలైన తర్వాత ట్రోలింగ్ చాలా దారుణంగా జరిగింది. ఆయనమీద ఎన్ని మీమ్స్ వచ్చాయో అందరం చూశాం. నటించే ఆఫర్ వస్తే చ్చినా చేయను అని నయనతార చెప్పుకొచ్చిందంటున్నారు. అయితే ఆమె ఇలా ఎందుకు చెప్పింది అనేది ఎవరికీ అర్థం కావడంలేదు. వీళ్లిద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇటీవలే నయన్ విఘ్నేష్ శివన్ కు విడాకులివ్వబోతోందంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇన్ స్టాలో విఘ్నేష్ ను నయన్ అన్ ఫాలో చేయడంతో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తర్వాత ఒక వీడియో రీ షేర్ చేయడంతో అంతా బాగానే ఉందనే స్పష్టత వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+