పూజాహెగ్డే భవిష్యత్తుకు హామీ ఇచ్చిన స్టార్ హీరో

బుట్టబొమ్మ అనగానే పేరు చెప్పకుండానే అర్థమవుతుంది పూజాహెగ్డే అని. తెలుగులో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తర్వాత ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ వరుసగా ఫ్లాపయ్యాయి. అప్పటివరకు గోల్డెన్ లెగ్ అన్నవారంతా పూజాను ఐరన్ లెగ్ అనడం ప్రారంభించారు. దీనికితోడు హిందీలో సల్మాన్ ఖాన్ సరసన చేసిన కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అమ్మడుకు సినిమా అవకాశాలు కరవయ్యాయి. పూజాహెగ్డే పేరు చెబితే నిర్మాత, దర్శకులు పారిపోయే పరిస్థితి నెలకొంది.

త్వరలోనే అధికారిక ప్రకటన
ఈ సమయంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్ ఫొటోలను పెడుతూ అందరితో టచ్ లోనే ఉంది. సినిమాలేవీ లేవు అనుకుంటున్న తరుణంలో ఓ బంపర్ ఆఫర్ పూజా తలుపు తట్టింది. తమిళ స్ఠార్ హీరో సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే ఎంపికైంది. ఈ సినిమా హిట్టయితే పూజా కెరీర్ మళ్లీ ఊపందుకోవడమేకాదు ఓ రేంజ్ కు కూడా వెళుతుంది. సూర్యకు ఇది 44వ సినిమా. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించబోతోంది.

heroine pooja hegde selected suriya and karthik subbaraju combo movie

నాగచైతన్య సరసన?
సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా, మళయాళ నటుడు జోజు జార్జ్ ఓ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. వాస్తవానికి పూజా భవిష్యత్తు ఇప్పుడు సూర్య చేతిలో ఉంది. హిట్ ఇచ్చాడా.. అమ్మడు కెరీర్ నిలబడుతుంది. మరో మూడు సంవత్సరాలు వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాదు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన దేవా అనే సినిమా చేస్తోంది. దీనితర్వాత తెలుగులో నాగచైతన్య కథానాయకుడిగా రూపుదిద్దుకోబోతున్న సినిమాలో కూడా పూజా హీరోయిన్ గా ఎంపికైందంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా చెప్పాల్సి ఉంది. మొత్తానికి పూజా భవిష్యత్తును సూర్య తీసుకున్నారని, పూచీ అంతా ఆయనేదనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

పూజా అంటేనే నిర్మాతకు ఖర్చు
వాస్తవానికి పూజా తన రెమ్యునరేషన్ ను చాలా ఎక్కువగా తీసుకునేది. తనతోపాటు వచ్చే తన టీం సభ్యులకు కూడా నిర్మాతే ఖర్చు భరించాల్సి వచ్చేది. వారి విమాన టికెట్లు, హోటల్ ఖర్చు అన్నీ నిర్మాతే భరించాలి. స్టార్ హీరోయిన్ గా ఉన్న తరుణంలో ఇలా జరిగింది. కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే తనకే సినిమాలు ఆఫర్లు రావడంలేదుగా. ఇకనుంచి తన టీం సభ్యుల ఖర్చు కూడా ఆమే భరించుకోవాలి. అలా అయితేనే ఆఫర్లు కూడా వస్తాయి. లేదంటే అంతే సంగతలు.. చిత్తగించవలయును.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+