బయటపడ్డ పూజా హెగ్డే ఎఫైర్
బుట్టబొమ్మ పూజాహెగ్డేకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందని చెప్పొచ్చు. వరుస సూపర్ హిట్లతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అనూహ్యంగా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. గుంటూరు కారం సినిమా కూడా సగం చేసి వదులుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం రాధేశ్యామ్, బీస్ట్ తోపాటు కిసీకాభాయ్ కిసీకాజన్ తో పాటు మరో రెండు సినిమాలు కలిపి అన్నీ వరుసగా ఫ్లాపవడంతో నిర్మాత, దర్శకులు, హీరోలు ముఖం చాటేశారు.
ఇటీవలే ముంబయిలో రూ.45 కోట్లు ఖర్చుపెట్టి ఇల్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. చేతిలో సినిమాలు లేకపోవడంతో ప్రేమలో మునిగి తేలుతోందంటున్నారు. తన బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయింది. అతని ఫొటో కూడా బయటకు వచ్చింది. హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రాతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. పూజా ఎక్కడకు వెళ్లినా అతను కూడా అక్కడే ఉంటున్నారు.

తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లగా వారితోపాటు రోహన్ కూడా కనిపించాడు. అంతేకాదు.. ఫొటోలను ఫోజులిచ్చారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే పూజా నోరు విప్పాల్సిందే. అప్పటివరకు అందరూ ఎదురు చూడాల్సిందే. చివరగా ఆచార్య సినిమాలో కనిపించగా అది కాస్తా బ్లాక్ బస్టర్ డిజాస్టర్ గా నిలవడంతో అమ్మడుకు నిరాశ తప్పలేదు.
సినిమాలు తగ్గినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది. తన అందమైన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది. ఫాలోవర్లు కూడా మిలియన్ల సంఖ్యలోనే ఉన్నారు. రెండు సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైందంటున్నారుకానీ అందుకు సంబంధించిన వారి నుంచి మాత్రం అధికారికంగా వార్త రాకపోవడంతో అమ్మడు తెలుగులో సినిమాలు చేస్తుందా? లేదా? అనేది చూడాలి.












Click it and Unblock the Notifications