బికినితో అల్లాడించిన ప్రభాస్ హీరోయిన్
ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి. టాలెంట్ ఉండి కూడా అదృష్టం లేక చాలామంది కెరీర్ ఆరంభంలోనే ముగిసిపోయింది. అలా టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో రిద్ది కుమార్ ముందు వరుసలో ఉంటారు. రిద్ది కుమార్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఆ మధ్య రాజ్ తరుణ్ నటించిన 'లవర్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది రిద్ది కుమార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచినప్పటికీ, రిద్ది కుమార్ లుక్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే రిద్ది కుమార్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో తెలుగులో ఈ భామ మళ్లీ కనిపించలేదు.
అయితే హిందీ, మలయాళం ఇండస్ట్రీల్లో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్‌ల్లో రిద్ది కుమార్‌కు అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు మూడు వెబ్ సిరీస్‌ల్లో నటించింది. రిద్ది కుమార్ నటించిన 'హ్యక్స్ క్రైమ్ ఆన్ లైన్'వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది రిద్ది కుమార్. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను సైతం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటుంది. రిద్ది కుమార్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే బికినీ ఫోటోలని షేర్ చేసింది.

సముద్ర తీరంలో జలకాలాడుతున్న ఫొటోలను విడుదల చేసింది. బికినీ సూట్‌లో మెస్మరైజ్ చేసే అందంతో కట్టి పడేసింది. ఎల్లో కలర్ టూ పీస్ బికినితో అభిమానులను అల్లాడించింది. సినిమాలలో పద్ధతైన పాత్రలలో కనిపించిన రిద్ది కుమార్‌ను ఇలా బికినీ లుక్స్ లో చూసేసరికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి గ్లామర్ లుక్స్‌లో ఏదైనా ఒక్క సినిమాలో కనిపిస్తే రిద్ది కుమార్ స్టార్ హీరోయిన్ అయిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రిద్ది కుమార్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్ సినిమాలో నటిస్తోంది. గతంలో ఆయన నటించిన రాధేశ్యామ్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది.












Click it and Unblock the Notifications