మెగా ఇంటి కోడలు కాబోతున్న మరో స్టార్ హీరోయిన్?
మరో స్టార్ హీరోయిన్ మెగా కుటుంబానికి కోడలు కాబోతోందా? అనే చర్చ తెలుగు ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది. అధిక శాతం మంది దీనికి ఔననే సమాధానమే ఇస్తున్నారు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో మనువాడబోతోంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని చాలా గుట్టుగా దాచిపెట్టారు. ఉంగరాలు మార్చుకొని మేం ప్రేమలో ఉన్నాం అని చెప్పిన తర్వాతే తర్వాతే అందరికీ తెలిసింది.
వేడుకలకు హాజరవుతోంది : ఈ కోవలోనే హీరోయిన్ రితూవర్మ మెగా ఇంటికోడులు కాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రితూవర్మ మెగా కుటుంబంతో ఎక్కువగా కలిసిపోతోందని, ఏ ఫంక్షన్ జరిగినా కచ్చితంగా హాజరవుతోందంటున్నారు. ఎందుకంటే బయటవారికి ఎవరికీ సంబంధం లేకుండా మెగా కుటుంబ సభ్యులకు మాత్రమే జరిగే వేడుకలకు కూడా రితూవర్మ కచ్చితంగా వెళుతోంది.

వారిద్దరిలో ఒకరా : ఆమె మెగా హీరోను ప్రేమించిందని, ఇంట్లో పెద్దలు కూడా రెండువైపులా ఒప్పుకున్నారంటున్నారు. అయితే ఏ ఇంటికి కోడలిగా వెళ్లబోతోందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ ను లేదంటే అల్లు శిరీష్.. వీరిద్దరిలో ఒకరిని ప్రేమిస్తోందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి మాదిరిగా ఉంగరాలు మార్చుకొని చెప్పేంతవరకు ఈ సస్పెన్స్ తప్పదేమో అనిపిస్తోంది. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది రితూవర్మ. ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాళ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. హోమ్లీగా కనిపించడం ఈ ముద్దుగుమ్మ బలం.












Click it and Unblock the Notifications